అనంత క్రీడల కీర్తి కిరీటం మచ్చా రామలింగా రెడ్డి
కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు అన్నారు మహాకవి శ్రీశ్రీ మచ్చా రామలింగా రెడ్డి ఆకోవకు చెందిన వ్యక్తి, అనంతపురం జిల్లాలో క్రీడలకు ప్రాణం పోసిన క్రీడాకారునిగా జర్నలిస్టుల సమస్యలపట్ల నిరంతరం పోరాడే జర్నలిస్టు యూనియన్ నాయకునిగా అకుశం పత్రికా సంపాదకుని అంతకంటే ముఖ్యంగా మానవత్వం పరిమళించే మంచివ్యక్తిగా స్నేహశీలిగా మచ్చా రామలింగా రెడ్డి అందరికీ సుపరిచితులే ! ముక్కు సూటిదనం, నిజాలు నిర్భయంగా వెల్లడించేమనస్తత్వం ఏదైనా సాధించేపట్టుదల, సమస్యలపట్ల నిరంతరం జ్వలించే స్పందించి, స్పందించే నాయకత్వ లక్షణాలు, మచ్చారామలింగా రెడ్డి ఓ విలక్షణ వ్యక్తిగా ఓ క్రీడాశక్తిగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షునిగా భారతదేశం మహిళా క్రికెట్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ సంఘం జాయింట్ సెక్రటరిగా అనేక పదవులను అలంకరింపజేసింది. నిరంతర కృషి పట్టుదల క్రీడారంగంలో మచ్చా రామలింగా రెడ్డిని జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చి పెట్టాయి. ఇటీవల జరిగిన రాష్ట్ర ఒలంపిక్ సంఘం ఎన్నికల్లో మచ్చా రామలింగా రెడ్డి సంయుక్త కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎంపిక చేయడం క్రీడా రంగానికి ఆయన చేసిన సేవలకు ప్రత్యక్షనిదర్శనం, రాయలసీమలోనే ఇప్పటి వరకు ఎవరికీ దక్కని అరుదైన గౌరవం.. పదవి (రాష్ట్ర ఒలంపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి) ఒక్క మచ్చా రామలింగా రెడ్డికే దక్కడం జిల్లాకే గర్వకారణం.
ఈ నేపథ్యంలో మచ్చా రామలింగా రెడ్డి గురించి ప్రత్యేక వ్యాసం ఇది..
అనంతపురం జిల్లాలో 1973లో మచ్చా నారపరెడ్డి దంపతులకు రామలింగా రెడ్డి జన్మించారు. అనంతపురంలోనే ఉన్నత చదువును కొనసాగిస్తూ.. జర్నలిజం రంగంలో ప్రవేశించారు. వృత్తి జర్నలిజం అయినా ప్రవృత్తిగా క్రీడారంగాన్ని ఎంచుకున్నారు. గత రెండు దశాబ్దాలుగా క్రీడారంగంలో అనితర సాధ్యమైన కృషి చేశారు. జిల్లా మహిళా క్రికెట్‌కు జీవం పోశారు. బయటికి రావడానికే బయటపడుతున్న యువతుల్లో దాగిన క్రీడా నైపుణ్యాలను వెలికి తీశారు. జిల్లా స్థాయి టోర్నీల నుండి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి మహిళా క్రీడలను, టోర్నీలను నిర్వహించారు. ఎందరో మహిళా క్రీడాకారిణులను ప్రోత్సహించారు. జిల్లా మహిళా క్రికెట్ అసోసియేషన్ భవనాన్ని అనంతపురంలో నిర్మించారు. 1990లో జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఛైర్మెన్‌గా ఎంపికై 1992లో రాయల సీమ సౌత్‌జోన్ సెలక్షన్ కమిటీ ఛైర్మెన్‌గా ఎనలేని సేవలు చేశారు. మచ్చా రామలింగా రెడ్డి చేసిన కృషికి గుర్తింపుగా.. 2003లో ఆంధ్రప్రదేశ్ మహిళా క్రికెట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. దేశంలోని వివిధ రాష్ర్టాలలో విస్తృతంగా పర్యటించి జాతీయ స్థాయి క్రికెట్ టోర్నీలను నిర్వహించారు. ఫలితంగా 2007-08లో భారత మహిళా క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఎంపికై అనంతపురం జిల్లా కీర్తి పతాకాన్ని జాతీయ స్థాయిలో ఎగురవేశారు.
జాతీయ అంతర్జాతీయ టోర్నమెంట్ నిర్వాహకునిగా పదవులు ః-
మచ్చా రామలింగా రెడ్డి క్రీడా ప్రస్థానం.. జిల్లానుండి ప్రారంభమై.. రాష్ట్ర స్థాయికి కొనసాగి.. జాతీయ స్థాయిలో కలికితురాయిలా మెరిసింది. 2004లో ఇండియా – న్యూజిలాండ్ అంతర్జాతీయ వన్‌డే మహిళా క్రికెట్ పోటీకి ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎంపిక కావడం యాధృచ్ఛికమేకాదు. మచ్చా రామలింగా రెడ్డి క్రీడాప్రతిభకు టోర్నీల నిర్వహణ దక్షతకు నిదర్శనం హైదరాబాద్ లాల్ బహుద్దూర్ స్టేడియంలో అంతర్జాతీయ వన్‌డే మహిళా క్రికెట్ పోటీలు సమర్థవంతంగా నిర్వహించి.. పలువురి దేశవిదేశాల ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. 2002లో ఇండియా ఇంగ్లాండ్ అంతర్జాతీయ వన్‌డే మహిళా క్రికెట్ పోటీకి ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులుగా ఉంటూ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారు.
టోర్నమెంట్ల నిర్వహణలో మచ్చా రామలింగా రెడ్డి కృషి ః-
మహిళల్లో దాగివున్న అంతర్గత నైపుణ్యాలతో పదునుపెట్టడానికి వారిని ప్రోత్సహించడానికి మచ్చా రామలింగా రెడ్డి ఎంతగానో కృషి చేశారు. 1998 నుంచి 2004 వరకు వివిధ ప్రాంతాల్లో మహిళా క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించారు. మచ్చుకు కొన్ని
1998 – నుండి ప్రతిఏటా రాజీవ్‌గాంధీ మెమోరియల్ ట్రోఫి రాయలసీమ స్థాయి క్రికెట్, షటిల్ టోర్నమెంట్ల నిర్వహణ
1999 – అంతర్ జిల్లాల మహిళా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ
1997 – భవానీ ట్రోఫి మహిళా క్రికెట్ టోర్నమెంట్ ఆంధ్ర-తమిళనాడు జట్ల మధ్య అండర్-22 అంతర్ రాష్ట్ర బాలుర క్రికెట్ టోర్నమెంట్
1996 – ఆంధ్ర-కేరళ జట్ల మధ్య అండర్ -22 అంతర్ రాష్ట్ర బాలుర క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ
1994 – 2004 ప్రతిఏటా వేసవిలో ఉచిత క్రికెట్ శిక్షణా శిబిరాల నిర్వహణ
1995 – రాయలసీమ స్థాయి క్రికెట్ టోర్నమెంట్
2000 – భవానీ ట్రోఫి మహిళా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ
2004 – అనంతపురంలో జాతీయ స్థాయి మహిళా క్రికెట్ టోర్నమెంట్ అంతర్జాతీయ క్రికెటర్లతో నిర్వహించారు.
వీటితోపాటు 2002లో అనంతపురంలో జాతీయ స్థాయి మహిళా క్రికెట్ టోర్నమెంట్, 2003లో అనంతపురంలో సౌత్ ఇండియా మహిళా క్రికెట్ టోర్నమెంట్, అదే ఏడాది నెల్లూరు జిల్లా గూడూరులో జాతీయ స్థాయి మహిళా క్రికెట్ టోర్నమెంట్లను ఎంతో సమర్థవంతంగా నిర్వహించి.. పలువురి క్రీడాకారులు, క్రీడాభిమానుల ప్రశంసలు అందుకున్నారు.
క్రీడాకారునిగా .. మచ్చా ప్రస్థానం.
పువ్వుపుట్టగానే పరిమళిస్తుందంటూరు పెద్దలు. మచ్చా రామలింగా రెడ్డి బాల్యం నుండే క్రీడలపట్ల ఆసక్తి పెంచుకున్నారు. క్రీడల్లో ఎవరైతే చురుకైన వ్యక్తిగా ఉంటారో వారు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళతారని మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటారు. మచ్చా విషయంలో అదినిజమైంది. రుజువైంది. బాల్యమంతా ఆ స్థలంలో గడిచింది. పాఠశాల, కళాశాల తరగతి గదుల్లో కన్న క్రీడాప్రాంగణాల్లోనే మచ్చా రామలింగారెడ్డి కాలమంతా గడిచి పోయిందంటే అందులో ఆశ్చర్యం లేదు. క్రీడాపైనే ధ్యాస క్రీడల్లోనే తన శ్వాస అన్నట్లుగా బ్యాటు..బాలు చేతబట్టి క్రీడా మైదానాల్లో స్వేచ్ఛగా విహరించిన మచ్చా 1983-92లో అండర్-13, అండర్-15, అండర్-17, అండర్-19, అండర్-22, అండర్-25, ఆంధ్ర రాష్ట్ర జట్టులో సభ్యుడయ్యారంటే అన్ని వయసుల్లో అద్వితీయ క్రీడాకారునిగా తన ప్రతిభను కనబరచాడనే కదా అర్థం. 1991-94 వరకు శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. 1993లో ఆలిండియా ఇంటర్ యూనివర్శిటీ క్రికెట్ జట్టు సభ్యునిగా ఉన్నారు. 30 సార్లు సౌత్‌జోన్ జట్టుకు 200 పైగా ప్రైవేటు రాష్ట్రస్థాయి సౌత్ ఇండియా టోర్నమెంట్లలో పాల్గొన్నారు. మచ్చా రామలింగా రెడ్డికి క్రీడలంటే ప్రాణం. క్రికెట్ అంటే జీవితం అనడానికఇ 1998లో గుజరాత్‌లో ఎన్‌ఐఎస్ క్రికెట్ కోచ్ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేయడమే ప్రత్యక్ష సాక్ష్యం.
ఎ.పి.డబ్ల్యుజే జిల్లా అధ్యక్షునిగా.. సేవలు
జర్నలిజం.. క్రీడలు.. మచ్చా రామలింగా రెడ్డికి రెండుకళ్ళు క్రీడల్లో ఎంత ఆవేశం.. గెలవాలన్న లక్ష్యం.. కనబరిచారు.. జర్నలిస్టు సంఘం నాయకునిగా.. జర్నలిస్టులపై జరిగే దాడులపై అన్యాయాలపై సమస్యలపై తక్షణం స్పందించి నినదించి ఉద్యమాలు లేవదీయడంలో మచ్చా రామలింగా రెడ్డి ఏనాడు వెనకడుగు వేయలేదు. జర్నలిస్టులు ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని, వృత్తి ధర్మాన్ని.. వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించిన సంఘ విద్రోహక శక్తులు.. ఎంతటి వారైనా ఏ స్థాయి వారైనా.. ఎదురించి న్యాయం జరిగే వరకు పోరాటం చేసిన చరిత్ర మచ్చా రామలింగా రెడ్డిదనే చెప్పాలి. జర్నలిస్టులకోసం క్రికెట్ క్రీడలు నిర్వహించి జర్నలిస్టులో క్రీడాసక్తిని సమైక్యతా భావాన్ని పెంచడానికి విశేషకృషి చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం.. నివేశన స్థలాలకోసం.. జీవిత భీమాకోసం.. వృత్తి నైపుణ్యం పెంచే శిక్షణ శిబిరాల నిర్వహణకోసం, జర్నలిస్టులకు వెన్నుదన్నుగాఉంటూ.. ఎక్కడ జర్నలిస్టులకు అన్యాయం జరిగినా.. అక్కడ తాను ప్రత్యక్షమవుతూ.. నిజమైన నాయకత్వంతో ముందడుగు వేసి పోరాటాలు చేసిన చరిత్ర మచ్చా రామలింగా రెడ్డిదనే చెప్పాలి. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతికలది పాత్రికేయులది బృహత్తర బాధ్యత ఉంది. అలాంటి జర్నలిస్టుల సంఘం నాయకునిగా మచ్చా తన పాత్రను సమర్థవంతంగా పోసిస్తూ ఎందరికో ఆదర్శ ప్రాయుడయ్యారు.
రాష్ట్ర ఒలంపిక్ సంఘం సంయుక్త కార్యదర్శిగా మచ్చా బాధ్యత ః-
అతిచిన్న వయసులోనే రాష్ట్ర ఒలంపిక్ సంఘం సంయుక్త కార్యదర్శిగా ఎంపికైన మచ్చా రామలింగా రెడ్డి బాధ్యత మరింత పెరిగింది. ఇన్నాళ్ళు కొన్ని క్రీడలకే పరిమితమైన ఆయన సేవలు.. ఒలంపిక్ సంఘం కార్యదర్శిగా.. 56 క్రీడలకు విస్తరించింది. అయితే మచ్చా రామలింగా రెడ్డి ఏ పని చేపట్టినా అందులో విజయం సునాయాసంగా ఆయనను వరిస్తుంది. ఆనమ్మకం తోటి అంతటి బృహత్తర బాధ్యతతో కూడిన పదవిని మచ్చాకు అప్పగించారు. జిల్లాలో 56 క్రీడల అభివృద్ధికి శక్తి వచంన లేకుండా కృషి చేస్తానని ఇప్పటికే మచ్చా రామలింగా రెడ్డి ప్రకటించారు. క్రికెట్, వాలీబాల్, పుట్‌బాల్, ఆటలతో పాటు టెన్నిస్, హాకీ, చపక్‌తప్రా,చెస్, వెయిట్ లిఫ్టింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, తదితర క్రీడలను జిల్లాలో రాబోవు రోజుల్లో అందరి సహకారంతో అభివృద్ధి చేస్తారని ఆశిద్దాం.
మచ్చా రామలింగా రెడ్డి ప్రత్యేకతలు
1. రాజీవ్ మెమోరియల్ టోర్నమెంట్ నిర్వహించి, శ్రీమతి సోనియా గాంధీ గారిచే ప్రసంశలు అందుకున్నారు.
2. పోలీసులు – పాత్రికేయుల మధ్య క్రీడలు నిర్హహించి, ఎందరో ఉన్నత స్థాయి పోలీసు అధికారుల అభినందనలు అందుకున్నారు.
3. జాతీయ స్థాయి క్రికెట్ చర్రితలోనే అతిపెద్దదైన ఏడు అడుగుల ట్రోఫితో టోర్నమెంట్ నిర్వహించి, ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు.
4. రాష్ట్రజుట్టలో జిల్లా క్రీడాకారిణులకు అవకాశం కల్పించి జిల్లా మహిళా క్రికెట్‌కు ప్రాణం పోశారు.
====================================================================
సమాచార రంగంలో.. సంచలనం వినూత్న శైలికి శ్రీకారం.. ‘అంకుశం’ వెబ్‌సైట్ ఆవిర్భావం
మీ ఫోటోలు, వార్తలు ప్రపంచ వ్యాప్తంగా.. ప్రచురించి ప్రసారం చేయడానికి ‘అకుంశం’ ప్రతిక.. అంకుశం డాట్‌కాంను ప్రారంభించనుందని చెప్పడానికి.. సంతోషిస్తున్నాం. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో, పరిశోధనాత్మక వ్యాసాలతో, ప్రభుత్వ సమాచారం, ఐఎఎస్, ఐపిఎస్, రాజకీయనాయకుల సమాచారంతో, వినూత్న రాజకీయ విశ్లేషణలతో, నిజాలను నిర్భయంగా, వెల్లడిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నకోట్లాది తెలుగు ప్రజల ఇల్ల లోగిళ్ళ వెబ్‌సైట్లలో తాజా సమాచారంతో తళుక్కున మెరిసే, అందరికీ అందుబాటులోకి రానుంది అంకుశం డాట్‌కాం.
సంచలనాత్మక వార్తా కథనాలతో చిన్న పత్రిక మరింత బలంపుంజుకొని సరికొత్త సాంకేతిక విప్లవ మార్గంలో పయనిస్తూ ప్రపంచ ప్రజలకు డాట్‌కం రూపంలో ప్రత్యక్షం కావడం అంకుశం, లక్ష్యం అని సవినయంగా పాఠకులకు తెలియజేస్తున్నాం. సంచలనాలకు మారుపేరుగా నిలుస్తుందనడం కన్నా సమాచార రంగంలో సమగ్రతకు సామీప్యతకు పారదర్శకతకు నైతిక విలువలకు నిబద్దతకు నిలువుటద్దంగా నిలుస్తుందని గట్టిగా చెప్పగలం. ప్రభుత్వ జీవోలు, టూరిజం ఆయా జిల్లాల తాజా సమాచారం, స్ర్కోలింగ్ వార్తలు, వార్తాకథనాలు, ప్రముఖ వ్యక్తుల ఫోటోలు వివిధ శాఖల అధికారుల రాజకీయ ప్రముఖుల ఇంటర్వ్యూలు కళా సాంస్కృతిక రంగాల ప్రతిభా మూర్తులు, ఇన్‌పర్‌మేషన్ టెక్నాలజి, శాస్త్రసాంకేతికరంగం సమాచారం. ఐటి నిపుణులు, విద్యావేత్తలు సేవారంగాల ప్రముఖుల చరిత్రలు సేవలతో పాటు అన్నిరంగాల సమగ్ర సమాచార వాహికగా అంకుశం ప్రపంచం వ్యాప్తంగా పరివ్యాప్తంకాబోతుంది. మారుతున్న కాలనికి అనుగుణంగా ప్రపపంచ ప్రజల అభిరుచులకు ఆకాంక్షలకు అనుగుణంగా వేగం పెంచుతూ దూరాన్ని తగ్గిస్తూ ప్రపంచంలోని దేశ దేశాలన్నిటినీ గ్లోబల్‌కు గ్రామంగా భావిస్తూ అంకుశం డాట్‌కం న్యూస్ వెబ్‌సైట్ ప్రపంచ ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. ఇదోక అంకుశం.. తొలిఅడుగు ప్రపంచ ప్రజల గుండెచప్పుడు చిన్న పత్రికా ప్రపంచంలో వార్తా విమాయాసంలో ఇదొక సరికొత్త పొద్దుపొడుపు గ్లోబల్ ప్రజల ముందుకు అంకుశం.. త్వరలో రాబోతోంది. సంప్రదించండి.. సహకరించండి.. వీక్షించండి.. సమీక్షించండి.. మీ.. అమూల్య సలహాలను తెలియజేయండి స్నేహహస్తం అందించండి.
ఇట్లు
మీ..
మచ్చా రామలింగా రెడ్డి
ఎడిటర్.
————————————————————————————————————————————————
అవినీతిపై ఎక్కుపెట్టిన అస్త్రం అంకుశం
ప్రజా స్వామ్య పరిరక్షణలో ఫోర్త్ ఎస్టేట్‌గా పిలువబడుతున్న పత్రికా రంగానిది కీలకమైన పాత్ర, పత్రికలు పెట్టుబడిదారుల విషపుత్రికలు అన్నారు మహాకవి శ్రీశ్రీ. నేడు చాలా పత్రికలు ఆ బాటలో నడిచినా, కొన్ని పత్రికలైనా ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి, అవినీతిని బట్టబయలు చేయడానికి నిబద్ధతతో కృషి చేస్తున్నాయి. అలాంటి పత్రికలలో అంకుశం ఒకటి. ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని అనేక సంవత్సరాలుగా అంకుశం పత్రిక నిరాఘంటగా నడుపుతూ నిస్పక్షపాతంగా వార్తా కథనాలను పాఠకులకు అందించింది. ఏ ఒక్క పార్టీకో, ఏ ఒక్క వ్యక్తికో వత్తాసు పలకకుండా నిజాలను నిర్భయంగా వెల్లడిస్తూ సామాజిక వాస్తవాలను దర్పణంగా అంకుశం పత్రిక వెలువడుతున్న విషయం పాఠక లోకానికి తెలుసు. ఏళవేళ సమస్యలకు పరిష్కార మార్గం చూపే వేదికకు అక్షరాలే పునాది రాళ్ళు, నిత్యనూతనంగా సమాజాన్ని చైతన్యవంతం చేసే కీర్తి పతాకాలు అవినీతిపై అంకుశాలు ఆయుధంగా మా పత్రిక అంకుశం విరాజిల్లు తోంది. కరువుసీమ అనంతలో పుట్టి నాలుగు శతాబ్దాల రాచనగరం హైదరాబాద్‌లో అడుగు పెట్టింది, నవవసంతాల అంకుశం ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజానీకానికి పరిచయం చేయాలనే సంకల్పంతో ఉన్నాము. ఈ సదవకాశాన్ని మీరు ఉపయోగించుకోవడానికి తెలుగు-ఆంగ్ల భాషల్లో ఒకే సమయంలో అంకుశం వెబ్‌సైట్ దర్శనమిస్తుంది ankusam.com 24hr eNews దేశంలోనే మొట్టమొదటి తెలుగు వెబ్‌సైట్‌ను ఏ వెబ్ బ్రౌజర్‌లోనైనా చూడగలిగినటువంటి సరికొత్తహంగులతో మీ ముందుకు రాబోతుంది. దేశంలో జరిగే అవినీతి, రియల్ ఎస్టేట్ మోసాలు, ఆర్థిక నేరాలు, అధికార దోపిడీ, ఫ్యాక్షన్ ముఠాలపై పోరాడటమే మా అంకుశం విధానం.. మహానగరాల్లో స్వంత ఇంటికల నేరవేర్చుకోవాలనే ఆశావాదులు వెల్లువలా మోసపోతున్నారు. రాజకీయ నాయకులు, ఐఏఎస్., ఐపిఎస్ అధికారులు సైతం రియల్ ఎస్టేట్, ఇతర పంచాయితీల్లో పాలుపంచుకుంటు కోట్లకు పడగలెత్తుతున్నారు. భూఆక్రమణదారులదే రాజ్యం. ఇక్కడ కండబలం వున్నవాడిదే భూమి, డాక్యుమెంట్లు, రిజిస్ర్టేషన్లు, బెదిరింపులు, దౌర్జన్యాల మాటున రియల్ ఎస్టేట్ రంగంలో లక్షలు, కోట్ల పేదల సొమ్ము దిగమింగి రాజకీయ నేతల అవతారమెత్తుతున్నారు. అవినీతిపై రియల్ రెక్కలు విరచడానికే మా వెబ్‌సైట్‌ను చార్మినార్ సాక్షిగా ఎక్కువపెట్టాం. ఆర్థిక నేరగాళ్లను ఎదుర్కోని ప్రజలకు అండగా నిలబడటమే అంకుశం విధి. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీకి కొమ్ముగాసే ఐఏఎస్, ఐపిఎస్‌లు అధికార యంత్రాంగం అవినీతి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ కండబలం, రాజకీయ పలుకుబడి గలవారిదే రాజ్యం. దోచుకున్న వాడిదే ధనం. ఉన్నతస్థాయిలో అధికారుల, వైట్‌కాలర్ నేరాలు అనేకం. ఏ ఫైల్ కావాలన్నా, కదలాలన్నా ప్రతిశాఖ కార్యాలయంలో సొమ్ము కట్టాల్సిందే. అధికారపార్టీ నాయకులను మచ్చిక చేసుకుని అవినీతి రాజ్యమేలుతున్న అధికారుల గుండెల్లో అంకుశం నిద్రపోతుంది. మా పత్రికను మరింతగా పదునుపెట్టి అవినీతిపై ఎక్కుపెట్టడమే మా లక్ష్యం. రంగుల హంగులతో సంతరించుకుని పాఠకుల మనోవేదికను అలరించడమే మా ఆశయం. ఈ ఆశయం వెనుక ఎన్నెన్నో ఆకాంక్షలు దాగివున్నాయి. ఆదరించండి. అండగా నిలవండి.