ఆస్ట్రేలియాకు ఐబిఎస్ రెండవ బ్యాచ్
ఇక్ఫాయన్ బిజినెస్ స్కూల్ (ఐబిఎస్)కు చెందిన 30 మంది పిజిపిఎం విద్యార్ధులు ఇంటర్నేషనల్ స్టడీ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆస్ట్రేలియాకు బయలుదేరారు. ఈ సందర్భంగా సంస్థ రిజిస్ట్రార్ ఆర్‌ఆర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వీరంతా అడిలైడ్‌లోని ఐబిఎస్‌కు పూర్తిస్థాయి స్కాలర్‌షిప్‌పై వెళ్ళనున్నారని, ఒక్కొక్కరిపై మేనేజ్‌మెంట్ నాలుగు లక్షల రూపాయల వరకూ ఖర్చు పెడుతోందని వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐబిఎస్ సెంటర్ల నుంచి మెరిట్ ఆధారంగా ఎంపిక చేసిన విద్యార్ధులకు ఒక సెమిస్టర్ విద్యాభ్యాసం కోసం ఆస్ట్రేలియా పంపుతున్నామని వివరించారు. నవంబర్ 2009లో తొలి బ్యాచ్ వెళ్ళి విజయవంతంగా తిరిగి వచ్చిందని వివరించారు. వచ్చే సంవత్సరం నుంచి రష్యా, స్విట్జర్లాండ్‌లో ఉన్న ఐబిఎస్ సెంటర్లకు సైతం విద్యార్ధులను పంపనున్నామని వివరించారు. భారతీయులు భావిస్తున్నట్టుగా ఆస్ట్రేలియాలో దాడులు జరగడం లేదని, ఒకటి రెండు చోట్ల కొన్ని సంఘటనలు జరిగినంత మాత్రాన అన్ని ప్రాంతాల్లో అవే పరిస్థితులు ఉన్నట్టు కాదని ఐబిఎస్ అడిలైడ్ డైరెక్టర్ ఫ్రాంక్ ఒ నీల్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఇక్ఫయన్ ఫౌండేషన్ సిసిడి డైరెక్టర్ టిఆర్ కృష్ణకుమార్ రావు తదితరులు పాల్గొన్నారు.




