“ఆరంజ్”
రామ్‌చరణ్‌తేజ్ తాజా సినిమాకు ఇప్పటి వరకూ వర్కింట్ టైటిల్‌గా చలామణిలో ఉన్న ‘ఆరంజ్’ను టైటిల్‌గా ఖరారు చేసారు. ‘ఓ రేంజ్ లవ్‌స్టోరీ’ (0 range love story ) అనేది దీనికి ఉపశీర్షిక. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్- జెనీలియా జంట గా నాగేంద్రబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ నిరవ ధికంగా జరుగుతోంది. ‘ఓ రేంజ్ లవ్‌స్టోరీ’ అని చాలా ధైర్యంగా ప్రకటించుకుంటున్న ఈ చిత్రం ఏ రేంజ్‌లో ఉంటుందో వేచి చూడాల్సిందే మరి! ‘మగధీర’ అనంతరం రూపొందుతున్న ఈ చిత్రం రామ్‌చరణ్‌తేజ్ కెరీర్‌కు చాలా కీలకం కావడంతో ఈ చిత్రాన్ని నాగేంద్రబాబు అత్యం త ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు!




