మరో రెండు వారాల్లో మరోచరిత్ర
మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ‘మరో చరిత్ర’ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని డిటియస్ మిక్సింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ద్వారా కెమెరామెన్ రవి యాదవ్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. వరుణ్ సందేష్, అనిత నాయకా నాయికలు. ఈ చిత్రంలోని పాటలను తమకు నచ్చిన వారికి అంకితం ఇచ్చే విధంగా పాటలను ఇవోల్ వెబ్‌సైట్‌లో పెట్టారు. ఈ వెబ్‌సైట్‌ను సంస్థ కార్యాలయంలో దిల్‌రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మరో చరిత్ర పాటలను తమకు నచ్చిన వారికి అంకితం ఇచ్చుకునే విధంగా అందరికీ అందుబాటులో వుండాలని పాటలను ఇవోల్ వెబ్‌సైట్‌లో వుంచడం జరిగింది. షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం డిటియస్ మిక్సింగ్ జరుగుతోంది. మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసి మార్చి చివరిలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.




