వదువు ఆమె కాదు!

Gunashekar‘వరుడు’ చిత్రంలో హీరోయిన్‌ ఈమేనంటూ కొన్ని వెబ్‌సైట్లలో ఓ అమ్మాయి ఫోటోలు పెట్టారు. అయితే.. ఆమె తమ ‘వధువు’ కాదని చెబుతున్నారు చిత్ర దర్శకులు గుణ శేఖర్‌. ‘ఈ అమ్మాయే ‘వరుడు’ చిత్ర కథానాయిక’ అంటూ కొన్ని వెబ్‌సైట్లలో ఓ అమ్మాయి ఫోటో పెట్టారు. అయితే.. ఆ అవ్మూయి మా హీరోయిన్‌ కాదు. హీరోయిన్‌ ఎవరనేది ముందే తెలియకపోవడం కథకు చాలా అవసరం కాబట్టే ఈ విషయంలో సస్పెన్స్‌ మెయింటైన్‌ చేస్తున్నాం తప్ప మరో ఉద్దేశ్యంతో కాదు’ అంటూ గుణశేఖర్‌ వివరించారు. కాగా.. ఈ చిత్ర సంగీత హక్కుదారులైన ఆదిత్య మ్యూజిక్‌ ప్రతినిధి దయానంద్‌.. ‘వరుడు’ పాటలకు లభిస్తున్న స్పందన పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తొలి విడతగా మార్కెట్‌లోకి పంపించిన సీడీలు, క్యాసెట్లు హాట్‌ కేక్స్‌లా సేల్‌ అవుతున్నాయని డీలర్స్‌ అందరూ పెద్ద ఎత్తున ఆర్డర్స్‌ బుక్‌ చేస్తున్నారని, మ్యూజికల్‌గా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచే దిశగా ‘వరుడు’ ఆడియో ఆదరణ పొందుతోందని దయానంద్‌ అన్నారు!

Leave a Reply

free website analytics