అసాంఘీకశక్తులను అరికడదాం ప్రజాసమస్యలపై స్పందిస్తాం – ఎస్పీ మనీష్‌కుమార్‌సిన్హా

DSC_0245
ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘీక శక్తుల ఆటకట్టిస్తామని జిల్లా ఎస్పీ మనీష్‌కుమార్‌సిన్హ హెచ్చరించారు. ఆయన పెనుకొండ పోలీస్‌ స్టేషన్‌ను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రధానంగా ప్రజాసమస్యలను దృష్టిలో ఉంచుకుని పిర్యాదులపై స్పందిస్తామన్నారు. ప్రజల జీవనం ప్రశాంతంగా సాగాలని, ప్రజలను ప్రత్యక్షంగా భాధించే నేరాలను అణచివేస్తామన్నారు. ఈ ప్రాంతంలో ప్యాక్షనిజం తగ్గుముఖం పట్టిందని, ప్యాక్షన్‌ గ్రామాలపై నిఘా ఉంచుకుని పల్లెనిద్రలు కొనసాగిస్తామన్నారు. పట్టణంలోని మాంచిదీది దర్గాకు వచ్చిపోయే భక్తులను కాళేశ్వరస్వామి సిబ్బంది పెట్టే ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని, దీనిపై కూడా చర్య తీసుకుంటామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠినచర్యలు తప్పవన్నారు. ముందుగా ఆయన స్టేషన్‌లో సి.ఐ, ఎస్‌.ఐ మురళీకృష్ణతో సమస్యలపై ఆరాతీసి అడిగి తెలుసుకున్నారు. ప్రజల అభీష్టం మేరకు ప్రతిఒక్కరూ పనిచేయాలన్నారు. సి.ఐ రామకృష్ణ, ఎస్‌.ఐ మురళీకృష్ణతో సమస్యలపై ఆరా తీశారు. ప్రజల అబీష్టం మేరకు ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు.

Leave a Reply

free website analytics