ఎపిపిఎస్‌సి చైర్మెన్‌ను తొలగించాలని కళ్లకు గంతలు కట్టుకుని నిరసన
ఎపిపిఎస్‌సి చైర్మెన్ వెంకటరామిరెడ్డిని విధుల్లో నుంచి తొలగించాలని ఐక్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శనివారం స్థానిక క్లాక్‌టవర్ వద్దనున్న ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకునీ, నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆ శాఖ జిల్లా అధ్యక్షులు సాకే నరేష్ మాట్లాడుతూ.. బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు వ్యతిరేకంగా వెంకటరామిరెడ్డి కులపక్షపాతిగా వ్యవహరిస్తున్నారనీ ఆరోపించారు. గతంలో కూడా ప్రిలిమ్స్ లో రిజర్వేషన్లు వద్దనీ, మాట్లాడి, సుప్రిమ్ కోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేశారన్నారు. పరీక్షల్లో 649 మార్కులు సాధించిన వారికి ఇంటర్వ్యూలో 21 మార్కులు వేసి, అగ్రవర్ణాల అభ్యర్థులకు పరీక్షల్లో 570 మార్కులు రాగా, ఇంటర్వ్యూల్లో వారికి 82 మార్కులు వేశారనీ ఆరోపించారు. కులపక్షపాతిగా వ్యవహరిస్తున్న చైర్మెన్ వెంకటరామిరెడ్డిని వెంటనే తొలగించాలని లేని పక్షంలో ఉద్యమం మరింత ఉదృతం చేస్తామనీ హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో మధుబాబు, సాంబశివుడు, రామాంజనేయులు, హరికృష్ణ, రాఘవేంద్ర, హనీఫ్, ఇమ్రాన్, అంజి తదితరులు పాల్గొన్నారు.




