ఐదు మంది మట్కా బీటర్లు అరెస్టు, రూ.33,250నగదు స్వాదీనం

పరిగి మండలానికి చెందిన మోదా గ్రామంలో హిందూపురం రూరల్‌ సి.ఐ వేణుగోపాల్‌ ప్రత్యేక నిఘా వేయడంతో నిర్వాహకునికి, బీటర్లకు అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్న మోదాకు చెందిన పల్లెల్లిఅనిల్‌కుమార్‌ తోపాటు బీటర్లు లక్ష్మికాంతప్ప, మోదాజగన్నాథం, బి.క్రిష్ణమూర్తి, రొద్దం బాబులను ఆయన అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వారి వద్దనుండి రూ.33,200నగదు 8సెల్‌పోన్లను స్వాదీనం చేసుకున్నారు. వివరాలను సి.ఐ స్థానిక రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ కార్యాలయంలో విలేకరులకు వివరించారు. గత నాలుగునెలల నుండి పల్లెల్లిఅనిల్‌కుమార్‌ మోదాలో ఉంటూ మట్కాబీటర్లైన నలుగురివద్ద నుండి మట్కా పట్టీలతో పాటు వారి వద్దనుండి సొమ్ము వసూలు చేసుకుని హిందూపురం లో మట్కా నిర్వాహకునికి చేరవేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. సమాచారం తెలుసుకున్న తాను ప్రత్యేకంగా నిఘా ఉంచి ఎస్‌.ఐ శివరాముడుతోపాటు కానిస్టేబుళ్ళు ఆనంద్‌, సునీల్‌నాయక్‌, సజ్జత్‌వలీతో దాడిచేసి వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మట్కా బీటర్లేకాకుండా నిర్వాహకులపై కూడా తగు చర్యు తీసుకుంటానని ఆయన ఈ సందర్బంగా తెలిపారు. పట్టుబడిన వారి సమాచారం మేరకు హిందూపురంలోని మట్కా నిర్వాహకున్ని అరెస్టు చేయడం కోసం అన్వేషిస్తున్నామన్నారు. అరెస్టు చేసిన ఐదుగురిని కోర్టుకు హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

free website analytics