పట్టణ బంద్‌తో నిలిచిపోయిన ఆర్టీసి బస్సులు

బాబ్లీ ప్రాజెక్టు సందర్శనానికి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఇతర ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ,ఎంపిల అరెస్ట్‌ నిరసనగా సోమవారం పట్టణంలో భారీగా బంద్‌ చేపట్టడంతో ఆర్టీసి బస్సులు డిపోకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం 6గంటకే తెలుగుదేశంపార్టీ నాయకులు బంద్‌కు పిలుపునివ్వడంతో ఏలాంటి ఆర్టీసి బస్సులను అధికారులు నడపలేదు.
దీంతో ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కర్ణాటక ప్రాంతాలైనా తుమకూరు, బెంగళూరు, మధుగిరి, శిర, కొరటగెర, పావగడ, బళ్ళారి, చిత్రదుర్గ వంటి ప్రాంతాలకు మడకశిర నుంచే బస్సులు పోవాల్సి ఉండగా సోమవారం బంద్‌పాటించడంతో ఆ బస్సులన్నీ నిలిచిపోయాయి. దీంతో కర్ణాటక ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆంధ్ర బస్సులతో పాటు కర్ణాటక బస్సులను కూడా అనుమతించలేదు. చివరకు ఆటోలనుకూడా అనుమతించకపోవడంతో ప్రయాణీకుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. కిలోమీటర్ల కొద్దీ ప్రయాణీకులు నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్నపిల్లల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. సాయంత్రం వరకు ఏలాంటి బస్సులను నడపకపోవడంతోప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Leave a Reply

free website analytics