రైతు ఆత్మహత్య
మండలంలోని కొండకారి కుంటకు చెందిన రాజగోపాల్ నాయుడు(57) అనే రైతు గురువారం పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. వివరాల మేరకు మృతుడు రాజగోపాల్ నాయుడు దీర్ఘకాల అనారోగ్యంతో బాధ పడేవాడని, దీనికి తోడు కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేక పోవడంతో చేసేదేమి లేక ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. మృతునికి 2 రెండకరాల పొలం వుందని, కుటుంబ మంతా పొలం పనులు చేసుకొని జీవనం సాగిస్తుండేవారని వారు తెలిపారు. మృతునికి భార్య, కొడుకు వున్నారని పోలీసులు తెలిపారు. పుట్లూరు ఎస్సై నారాయణ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.




