13న ముఖ్యమంత్రి పర్యటన

30pan1ఒక్కరోజు పర్యటన నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఈ నెల 13న జిల్లాకు వస్తున్నారు. 13న ఉదయం 6.20 నిమిషాలకు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బయలుదేరి 7.40 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ అధికార, అనధికార ప్రముఖులతో సమావేశమైన అనంతరం 8 గంటలకు తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. 9.45 నిమిషాల వరకు విశ్రాంతి తీసుకున్న అనంతరం గెస్ట్‌హౌస్‌ నుండి బయలుదేరి తారకరామస్టేడియంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10 గంటలకు అక్కడనుంచి ప్రభుత్వ హెలికాప్టర్‌లో బయలుదేరి 10.30 గంటలకు సదుం చేరుకుంటారు. అక్కడ అనధికార, అధికార ప్రముఖులతో సమావేశమవుతారు. 10.40 నుండి 12.10 వరకు స్థానికంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 12.20 నుండి 1 గంట వరకు విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం 1.15కు సదుంలో హెలికాప్టర్‌లో బయలుదేరి చెన్నైకి వెళతారు.

Leave a Reply

free website analytics