ఈనెల 22న వైఎస్‌ఆర్ కాంస్య విగ్రహావిష్కరణ
ఈనెల 23వ తేదిన స్థానిక బస్టాండు సమీపంలో బారత్ గ్యాస్ కూడలి వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంస్య విగ్రహం ను ఆవిస్కరించనున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షులు గీతాల వెంకటరామిరెడ్డి తెలిపారు. ఇందుకోసం ఆర్‌అండ్‌బి ఇఇ రమేష్ కుమార్, డిఇ చంద్రశేఖర్, ఎంపిపి లక్ష్మినరసయ్య, సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు భూమాన్ శివశంకర్ రెడ్డి, జిల్లా పరిషత్ కో ఆప్సన్ సభ్యుడు సబ్బీర్ అహ్మద్ స్థలాన్ని పరిశీలించారు.




