ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

విలువైన ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తుండగా మైదుకూరు సిఐ బాల స్వామి రెడ్డి తన సిబ్బందితో దాడి చేసి ముగ్గురు స్మగ్లర్లను మంగళవారం అరెస్టు చేశారు. అలాగే 85 ఎర్రచందనం దుంగలను, మూడు గాడిదలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాల్లోకెళ్లగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో డిఎస్‌పి కోటిరెడ్డి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లమల అడవుల లోతట్టు ప్రాంతాల నుంచి గాడిదల మీద ఎర్రచందనం దుంగలను మైదాన ప్రాంతాలకు రవాణా చేస్తుండగా దువ్వూరు మండలం క్రిష్ణంపల్లె గ్రామం సమీపంలో దాడులు నిర్వహించడం జరిగిందన్నారు.  దుంగలను, గాడిదలను అటవీ అధికారులకు అప్పజెప్పామన్నారు. ఎర్రచందనం దుంగలను నంద్యాల, కర్నూలు ప్రాంతాలకు చెందిన ప్రధాన స్మగ్లర్లకు రవాణా చేయడం జరుగుతుందని స్మగ్లర్లు తెలిపారన్నారు. స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు ఒప్పుకోవడంతో దువ్వూరు మండలం దాసరిపల్లెకు చెందిన నాయినేని శివరామయ్య, నాయినేని సుబ్బరాయుడు, క్రిష్ణంపల్లెకు చెందిన రామయ్య లను అరుస్టు చేసి కేసు నమోదు చేయడం చేయడం జరిగిందన్నారు. వీరితో పాటు పారిపోయిన మరికొందరిని ఆరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు. ఈ దాడిలో వనిపెంట ఎఫ్‌ఆర్‌ఓ రవికుమార్‌, అటవీశాఖ సిబ్బంది కూడా సహకరించడం జరిగిందన్నారు. అలాగే పోలీసులు ఎ రామభూపాల్‌ రెడ్డి, శివాజీ గణేషన్‌, శివరామిరెడ్డి, నాగార్జున రెడ్డి, మునెయ్య, పురుషోత్తం నాయుడు పాల్గొనడం జరిగిందన్నారు.
అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటాం – డిఎస్‌పి
మైదుకూరు పట్టణంలో అధిక వడ్డీలకు అప్పులిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి వారిపై నిఘా వేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఎస్‌పి కోటిరెడ్డి తెలిపారు. అవసరానికి డబ్బులడిగితే అధిక వడ్డీలకు అప్పులిచ్చి పేదలను ఆర్థికంగా దెబ్బతీయడం చట్టరిత్యా నేరమౌతుందన్నారు.

Leave a Reply

free website analytics