సంఘసేవే సాదువుల లక్ష్యం
భక్తి,ప్రేమ,విశ్వాసాన్ని చెడగొట్టే విధంగా కొందరు స్వామీజీలు వ్యవహరించడం భాదాకరమని కర్నాటక రాష్ట్ర చిక్‌బళ్ళాపూర్‌కు చెందిన శివసాయి బాబా పేర్కోన్నారు.తిరుమల పర్యటనకు వెళుతూ ఆయన గురువారం చిత్తూరులోని టిటిడి ఛైర్మన్ సోదరుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త డి.కె బద్రనారాయణ గృహనికి విచ్చేశారు. ఈ సందర్భంగా శివ సాయి బాబా తనను కలసిన విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ సంఘసేవ సాదువుల లక్ష్యం అన్నారు.ఇటివల కాలంలో నిత్యానంద స్వామిజీపై వస్తున్న వార్తలు చాలా బాదాకరమని, దీనిని అందరు ముక్త కంఠంతో ఖండించాలన్నారు,మూడనమ్మకాలకు ఎవరూ బలికాకూడదనే ఉద్దేశంతో తాను ఒక గ్రంథాన్ని రచిస్తున్నానని శివసాయి బాబా తెలిపారు.చిక్‌బళ్ళాపూర్‌లోని శివసాయి బాబా ఆశ్రామంలో అనాదాశ్రమం,వృద్దాశ్రమం ద్వారా తాము సేవలు అందిస్తున్నట్లు శివసాయి బాబా తెలిపారు.కాగా చిత్తూరుకు విచ్చేసిన శివసాయి బాబాకు డి.కె బద్రనారాయణ దంపతులు ఘనస్వాగతం పలికారు,అధికసంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొన్నారు.




