Ankusam - 24 Hours e-News

బడ్జెట్ తర్వాతే విస్తరణ! – సొంత టీం కోసం కిరణ్ పట్టు
సమతుల్యం కోసం సీఎం వాదన

రేపోమాపో జగన్‌వర్గ ఎమ్మెల్యేలపై వేటు

ఈలోగా పదవుల పేర కొట్లాటలొద్దు

తెలంగాణ బెర్తుల భర్తీకూడా అంతే..

నచ్చజెప్పిన రాష్ట్ర ఇన్‌చార్జి ఆజాద్

యువకిరణాలపై సీఎం వివరణ

రెండు గంటలపాటు మంతనాలు

సోనియాతో పది నిమిషాలు భేటీ

పాలనాపరంగా మరింత పట్టు సాధించడానికి మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులు చేద్దామనుకున్న ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్‌డ్డికి ఈసారి కూడా నిరాశ తప్పలేదు. మంత్రివర్గంపై తనదైన ముద్ర కోసం ఆయన చేసిన తాజా ప్రతిపాదనపై అధిష్ఠానం అమోదముద్ర వేయలేదు. భారీ కసరత్తు జరిపి ఆయన రూపొందించిన జాబితాకు పార్టీ పెద్దల సమ్మతి లభించలేదు. రేపో మాపో జగన్ వర్గ ఎమ్మెల్యేలపై వేటు పడనున్నందున, బడ్జెట్ సమావేశాలు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నందున అప్పటివరకు విస్తరణ కుదరదని అధిష్ఠానం ఆయనను వారించింది. బడ్జెట్ సమావేశాల తర్వాత కొత్త టీంను ఏర్పాటు చేసుకోవచ్చన్న సంకేతాలిచ్చి సీఎంకు నచ్చజెప్పింది. మంత్రివర్గ విస్తరణ ప్రధాన ఎజెండాగా శనివారం హస్తినకు చేరుకున్న కిరణ్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్, పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమయ్యారు. ఉదయమే ఆయన ఢిల్లీకి చేరుకున్నప్పటికీ మధ్యాహ్నం వరకు పార్టీ పెద్దపూవరినీ కలుసుకోలేకపోయారు. 2జీ కుంభకోణంలో కేంద్ర హోం మంత్రి చిదంబరం పాత్రను తేల్చే కేసులో తీర్పు రానుండటంతో, పార్టీ పెద్దలంతా ఆ కోర్టు తీర్పు కోసం ఉత్కం ఎదురు చూశారు. మధ్యాహ్నం కోర్టు తీర్పు చిదంబరానికి అనుకూలంగా వచ్చిన తర్వాతే కిరణ్‌కు ఆపాయింట్‌మెంట్లు ఖరారయ్యాయి. దీంతో ఆయన మొదట ఆజాద్‌తో భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణతో పాటు, తాజా రాజకీయ పరిస్థితులు, రాజీవ్ యువకిరణాల పథకం, నామినే పదవుల భర్తీ, ఉప ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక తదితర కీలక అంశాలపై చర్చించడంతో సమావేశం దాదాపు 2గంటలకు పైగా సాగింది. విస్తరణ కోసం కిరణ్ పట్టుపట్టినట్లు సమాచారం.

తనకంటూ ఒక టీంను ఏర్పాటుచేసుకునేందుకు విస్తరణలో స్వేచ్ఛ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఎన్నికలకు ఎంతో కాలంలేనందున, విస్తరణ ఆలస్యంజరిగితే పాలనపై ప్రభావం తీవ్రంగా ఉంటుందని, మంత్రివర్గంలో సమన్వయం లేనందున దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందని తెలిపారని అంటున్నారు. మంత్రివర్గంలో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ ఉప ఎన్నికల్లో విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టనున్నాయని చెప్పారనిఅంటున్నారు. అయితే ఆజాద్ మాత్రం కిరణ్ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించలేదు. నేడో రేపో జగన్ వర్గ ఎమ్మెల్యేలపై వేటు పడనున్నదని, విస్తరణ చేపట్టక పోవడమే మేలని ఆయన చెప్పినట్టు సమాచారం. పైగా ఫిబ్రవరి రెండోవారంలో బడ్జెట్‌సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా ఇప్పుడు విస్తరణ చేపడితే తీవ్రగందరగోళానికి, అసంతృప్తికి తావిచ్చినట్టుఅవుతుందని ఆజాద్‌చెప్పినట్టు తెలిసింది.అయితే కనీసం తెలంగాణ నుంచి ఖాళీ అయిన స్థానాలనైనా భర్తీ చేసేందుకు అనుమతివ్వాలని కిరణ్ కోరినా.. ఆజాద్ ఓ నిర్ణయానికి రాలేక పోయారని తెలిసింది. విస్తరణ క్రమంలో అన్ని వర్గాలను సంతృప్తిపర్చడం సాధ్యం కానందున ఆ స్థానాల భర్తీని సైతం పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే బడ్జెట్ సమావేశాల తర్వాత మంత్రివర్గంలో మార్పులకు తమ ఆమోదం ఉంటుందని ఆజాద్ సంకేతాలిచ్చినట్లు తెలిసింది. అందుకే కిరణ్ తాను ఢిల్లీకి వచ్చిన పని పూర్తయ్యిందని సంతోషం వ్యక్తంచేశారని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు.

యువకిరణాల మాటేమిటి?

2014 ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఉపఎన్నికల్లో ఫలితాల మెరుగుకు కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రాధాన్యం లభించేలా చూడాలని ఆజాద్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా తాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రూపొందించిన రాజీవ్ యువకిరణాల పథకాన్ని ప్రధాని చేత వీలైనంత త్వరలో ప్రారంభింపచేసేలా చూడాలని విన్నవించినట్లు సమాచారం. ఆ పథకంపై అనుమానాలన్నీ ఆపోహలేనని సీఎం తగిన వివరాలందించినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఉపఎన్నికలకు ఉపయోగపడే విధంగా ప్రాణహిత-చే పోలవరం ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించే విధంగా కేంద్రాన్ని ఒప్పించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. దాంతో పాటు వరికి మద్దతు ధర పెంచితే సీమాంవూధలో ప్రభావం చూపి, ఉప ఎన్నికల్లో పార్టీకి లాభిస్తుందన్నవిషయాన్ని ఆజాద్ ముందుంచారు. ఉప ఎన్నికల్లో అభ్యర్థులఎంపిక, వ్యూహాలపై కూడా వారిరువురు చర్చించుకున్నట్లు సమాచారం. కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రాధాన్యం లభించే పక్షంలో ఎన్నికల ఫలితాలు బాగుంటాయని సీఎం అభివూపాయాన్ని వ్యక్త పరిచినట్లు తెలిసింది. దీనికి ఆజాద్ సానుకూలంగా స్పందించి, తన వంతు సహాయానికి హమీ ఇచ్చారని అంటున్నారు. దీంతో కిరణ్ అక్కడి నుంచి బయలు దేరి పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పది నిమిషాలపాటు సమావేశమయ్యారు. ఆజాద్‌తో సమాలోచనల సారాంశాన్ని సోనియాకు క్లుప్తంగా వివరించారు. ప్రధాన ఎజెండా అయిన మంత్రివర్గ విస్తరణపై అప్పటికే స్పష్టత నెలకొనడంతో పది నిమిషాల్లో ఈ సమావేశం ముగిసింది. దీంతో ఆయన ఏపీ భవన్‌కు వెళ్లిపోయారు. అప్పటికే అక్కడున్న ఆశావహులను కాదని కాటేజీలోని పై అంతస్తుకు వెళ్లారు. మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? ఉండదా? అన్న విషయాలేవీ వారు అడగకూడదన్న ఉద్దేశ్యంతోనే ఆయన పై గదికి వెళ్లారని సీనియర్ ఎమ్మెల్సీ ఒకరు తెలిపారు. సీఎం ఇక్కడ సోనియా రాజకీయ కార్యదర్శి ఆహ్మద్ పటేల్‌తో శనివారం రాత్రి సమావేశమై ఆదివారం ఉదయం రాష్ట్రానికి తిరుగు ప్రయాణం కానున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ అంశం తెరమీదకు వచ్చినప్పుడు హస్తినలో కనిపించే జేసీ దివాకర్ రెడ్డి, గండ్ర, భట్టి విక్రమార్క, కొండ్రు మురళి, రంగాడ్డి, రుద్రరాజు పద్మరాజు, ఎమ్మెల్సీ ప్రేమ సాగర్ తప్ప మిగిలిన నేతపూవరూ ఢిల్లీకి రాలేదు.

ఐఏఎస్‌ల తిరుగుబాటు వెనుక సీనియర్ మంత్రులు?

రాష్ట్రంలో ఇప్పటికే పలు సమస్యలతో, అధికార కేంద్రాలతో సతమతమవుతున్న ముఖ్యమంవూతికి తాజాగా ఐఏఎస్‌ల రూపంలో కొత్త తలనొప్పి వచ్చిపడింది. ఈ కొత్త తలనొప్పి సృష్టికి కొందరు సీనియర్ మంత్రులు కారణమని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం.. అధిష్ఠానం పెద్దలతో భేటీ సందర్భంగా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తనకు ఇబ్బందులు సృష్టించడానికే ఐఏఎస్‌లను ఇద్దరు సీనియర్ మంత్రులు రెచ్చగొడుతున్నారని అధిష్ఠానానికి సీఎం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

పెద్ద చేపలను వదిలి.. చిన్న చేపలను పడుతున్నారు
సీబీఐ అధికారులు, మంత్రుల వ్యవహార శైలిపై ఐఏఎస్‌లు తీవ్రంగా మండిపడ్డారు. పలు వివాదాస్పద నిర్ణయాలపై ఐఏఎస్ అధికారులను అరెస్టు చేయడాన్ని ఖండించారు. కేబినెట్ తీసుకునే నిర్ణయాలకు కార్యదర్శులను బాధ్యులను చేయడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. అధికారులందరూ నీతిమంతులని చెప్పడం లేదని, కానీ.. రాజకీయ నేతల్లో లంచం తీసుకుంటున్నవారు లేరా? అని ప్రశ్నించారు. పెద్ద చేపలను వదిలి, చిన్న చేపలను పట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎమ్మార్ ప్రాపర్టీస్, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాలు, జగన్ అక్రమాస్తులపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ అధికారులు ఆయా కేసులలో విచారణకు పిలిచే ఐఏఎస్ అధికారులపై నిందితులన్న ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులపైనా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన ఐఏఎస్‌లు, ‘నాకేం తెలియదు.. ఫైల్‌వచ్చింది సంతకం పెట్టాను..’ అంటే ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు. మంత్రిగా ప్రమాణం చేసేటప్పుడు ఏం చెబుతున్నారు? ఏమీ తెలియకుండా సంతకం చేసే వాళ్లు కేబినెట్‌లో ఎలా ఉంటారు? అలాంటి వారిని సీఎం ఎందుకు తొలగించడం లేదు? 100 కోట్లు తీసుకున్న వ్యక్తిని వదిలి, కోటి తీసుకున్న అధికారిని ఎలా తప్పుబడతారు? అని ప్రశ్నలు సంధించారు. వివిధ కుంభకోణాల్లో ఐఏఎస్‌లను సీబీఐ అధికారులు అరెస్టులు చేస్తున్న తీరుపై ఐఏఎస్‌ల సంఘం శనివారం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించింది. బేగంపేటలోని సీఎం క్యాంప్ కార్యాలయం పక్కనే ఉన్న సంఘం కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. సీఎం కార్యదర్శులు సహా వంద మందికిపైగా ఐఏఎస్‌లు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సీనియర్ ఐఏఎస్ అధికారులు భలేరావు, కాకి మాధవరావు, ప్రశాంత్ మహాపాత్ర, రేమండ్ పీటర్ తదితరులు రాత్రి 9గంటల ప్రాంతంలో మీడియాతో మాట్లాడారు. సీబీఐ విచారణ తీరుపై తీవ్రస్థాయి అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఐఏఎస్ బిజినెస్ నిబంధనల ప్రకారం సీబీఐ విచారణ జరుపుతున్నదా? అని భలేరావు ప్రశ్నించారు. కేబినెట్‌నిర్ణయాలకు కార్యదర్శిని ఎలా బాధ్యులను చేస్తారని మండిపడ్డారు. నిబంధనల గురించి వారికి కానీ మీడియాకు కానీ ఏమైనా తెలుసా? అని ప్రశ్నించారు. సీబీఐ తీరు సరిగా లేనప్పుడు, వారు ఇచ్చిన సమాచారంతో ఐఏఎస్‌ల వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బ తీసే విధంగా మీడియా కథనాలు ప్రచురిస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మంత్రి ఎలా వ్యవహరించాలి? కార్యదర్శి ఎలా వ్యవహరించాలి? వారికి ఉన్న బాధ్యతలు ఏమిటి? గవర్నర్, సీఎం అధికారాలు ఏంటి? అన్న నిబంధనలు బిజినెస్ రూల్స్‌లో వివరంగా ఉన్నాయి. వాటిని పాటిస్తున్నారా? లేదా? అన్నది చూడకుండా డిపార్టుమెంట్‌లో ఏది జరిగినా కార్యదర్శిదే బాధ్యత అన్నప్పుడు సంబంధిత మంత్రి ఉండిఎందుకు?’’ అని ఆయన సూటిగా ప్రశ్నించారు. నిర్దేశించిన అధికారాలను మాత్రమే కార్యదర్శి వినియోగించగలరని, ప్రతి వారం కార్యదర్శి చేసిన పనులను సమీక్షించాల్సి బాధ్యత మంత్రిదేనని కాకి మాధవరావు చెప్పారు. ఒక వేళ సంబంధిత మంత్రి విఫలమైతే కేబినెట్ మొత్తం విఫలమైన మంత్రిగా నిరూపితమైతే తొలగించాల్సిన బాధ్యత సీఎంకు లేదా? అని ప్రశ్నించారు.‘‘అవినీతి అనేది కేవలం అధికారుల్లోనే ఉందా? రాజకీయ నాయకుల్లో, మంత్రుల్లో లేదా?’’ అని మాధవరావు ఘాటుగా స్పందించారు. గనులు, పరిక్షిశమల్లో కుంభకోణం జరిగితే మొత్తం కేబినెట్ బాధ్యత వహించాలని చెప్పారు. సీబీఐకి ఈ నిబంధనల గురించి తెలుసా? అని నిలదీశారు. పెద్ద చేపలను వదిలి, చిన్న చేపలను పట్టుకుంటున్నారని చెప్పారు. ‘రైలు ప్రమాదం జరిగితే లాల్ బహదూర్ శాస్త్రి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయనేమీ లైన్‌మెన్ కాదు. జరిగిన ఘోరానికి బాధ్యతగా రాజీనామా చేశారు.

సంబంధితశాఖలో ఎలాంటి నిర్ణయం జరిగినా అందుకు బాధ్యుడు మంత్రే అని నిబంధనలు చెబుతున్నా, సీబీఐ ఎందుకు పట్టించుకోవడం లేదు’’ అని మాధవరావు ప్రశ్నించారు.సీబీఐకి వేరే కారణాలుఏమైనా ఉన్నాయా? అని అనుమానం వ్యక్తం చేశారు.ఇంట్లో కొడుకు పెళ్లి జరుగుతున్నప్పటికీ పట్టించుకోకుండా చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐకి మరొక్క రోజు ఆగే అవకాశం లేదాఅన్నారు. వైస్‌చైర్మన్‌తోపాటుపాలక మండలి సభ్యుల ఆమోదం లేకుండానే ఒక కార్యదర్శి నిర్ణయం తీసుకోగలడా? అని ఏపీఐఐసీ పాలక మండలిని ఉద్దేశించి ప్రశ్నించారు. ‘తాము చెప్పిందే చెప్పాలని ఓ గుమస్తాను సీబీఐ వాళ్లు ఒత్తిడి చేశారట. ఆ విషయాన్ని ఆ గుమస్తా నా వద్ద చెప్పుకుని ఏడ్చాడు. అలాగే అధికారులు వెళ్లినప్పుడు నీకు పైనుంచి ఒత్తిడి ఉందా? అని అడుగుతున్నారు. విచారణ విధానం అదే కావచ్చు, కానీ అధికారులను కార్యాలయానికి పిలిపించుకుని, మంత్రులను ఇళ్లకు వెళ్లి ‘ఏం చేస్తున్నారండి’ అని కుశల ప్రశ్నలు వేయడం ఎంత వరకు సబబు?’’ అని మాధవరావు నిలదీశారు.ఐఏఎస్‌అధికారులు అందరూ నీతిమంతులని తానుచెప్పడం లేదని, సీబీఐ పద్ధతి ప్రకారం విచారణ చేయాలని కోరుతున్నామన్నారు. ఇదే విషయాన్ని శుక్రవారంనాడు సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు.

సీఎం సానుకూలంగా స్పందిస్తే అత్యవసరసర్వసభ్య సమావేశం ఎందుకన్న ప్రశ్నకు, ఒకరిద్దరైతేఫర్వాలేదు, కానీ చాలా మంది ఐఏఎస్‌ల పేర్లను సీబీఐ బయటపెట్టడం ఆందోళన కలిగించిందని ప్రశాంత్ మహాపాత్ర చెప్పారు. చూస్తూ ఊరుకుంటే ఇది మరింత అనర్థాలకు దారితీస్తుందన్నారు. ‘‘నా 30ఏళ్ల ఉద్యోగ అనుభవంతో చెబుతున్నాను. మంత్రుల ప్రమేయం లేకుండా ఏ పనీ జరగదు. జిల్లాల్లో ఇన్‌చార్జి మంత్రులు, కార్పొరేషన్‌కి వెళితే చైర్మన్లు, పాలక మండలి సభ్యులు, సచివాలయానికివస్తే మంత్రులు, సీఎం ఇలాఅందరి ప్రమేయం లేకుండా ఏ పనీ జరగదు’’ అన్నారు. మంత్రులు చాలా అమాయకులు, మేం చెప్పిందే వింటారు అనుకుంటే ప్రభుత్వాన్ని వారు ఎలా నడుపుతారని ఒక ప్రశ్నకు జవాబిచ్చారు. శ్రీలక్ష్మీ, ఆచార్య నిర్దోషులని తాము చెప్పడం లేదని, తప్పు చేసిన వారికి శిక్ష సమానంగా ఉండాలన్నారు. ఎంత అందంగా ఉందో అంతే అవినీతి చేసిందని తమ సహచర ఐఏఎస్ గురించి వస్తున్న కథనాలను భలేరావు తీవ్రంగా ఖండించారు. కార్యదర్శి కానీ, మంత్రి కానీ.. ఎవరినా జవాబుదారితనంతో పని చేయాలని, ఐఏఎస్‌లపై దుష్ర్పచారాన్ని మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వైఎస్ చేయించిన తప్పులకు ఐఏఎస్‌లు బలి
మా హయాంలో అవార్డులు.. ఇప్పుడేమో జైళ్లు

మూలవిరాట్‌లను వదిలి సామాన్యులను పట్టేస్తున్నారు

మద్యం మాఫియా దర్యాప్తు తీరుపై బాబు ధ్వజం

రాజమండ్రి, ఫిబ్రవరి 4 : “ఒక వ్యక్తి చేయించిన తప్పులకు ఇపుడు ఎంతమంది జైలుకు వెళ్తున్నారో.. టీడీపీ హయాంలో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఐఏఎస్‌లు ఇపుడు జైలుకెళ్లే పరిస్థితి ఎదురైంది. ఇదంతా వైఎస్ హయాంలో, ఆయన ఒత్తిడికి తలొగ్గి పనిచేయడం వల్లే జరిగింది” అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎమ్మార్, గాలి అక్రమ గనులు, జగన్ అక్రమ ఆస్తుల కేసుల్లో ఒక్కొక్కరుగా ఐఏఎస్ అధికారులు జైలుకు వెళుతుండటం, దీనిపై ఐఏఎస్‌లు సీఎం కిరణ్ వద్ద నేరుగానే అసహనం వ్యక్తం చేయడం వంటి పరిణామాలపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.

లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన వారికి తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించారు. శనివారం తూర్పుగోదావరిజిల్లా రాజమండ్రిలో పార్టీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ” జైలుకెళ్లినంత మాత్రాన తప్పుచేసినట్టు కాదు కదా” అని తనను కలిసిన ఐఏఎస్‌ల వద్ద సీఎం కిరణ్ అభిప్రాయపడటాన్ని తప్పుబట్టారు. జైలుకెళ్లినా ఫర్వాలేదా.. హవ్వ.. నవ్వుతారంటూ ఎద్దేవా చేశారు. ” జైలు కెళ్లడం తప్పేముందని సీఎం అంటున్నారు. ఎంత దారుణం. ఇలాంటి విషయాలను తేలిగ్గా తీసుకోవడం సీఎం స్థాయి వ్యక్తులకు తగద”ని పేర్కొన్నారు.

ఇపుడు జైలుకెళ్తున్న ఆఫీసర్లే తమ హయాంలోనూ పనిచేశారని, అప్పట్లో వారికి అవార్డులు వస్తే ఇప్పుడు జైలుకు వెళ్లాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా వైఎస్ తన స్వలాభం కోసం అధికారులపై ఒత్తిడి చేయడం, ప్రలోభాలకు గురిచేసిన ఫలితమని ధ్వజమెత్తారు. ఆర్థిక కుంభకోణాల్లోనేకాదు..మద్యం మాఫియాలోనూ ‘మూలవిరాట్టు’లను వదిలేసి మామూలువాళ్లను అరెస్ట చేస్తున్నారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ బొత్సపై మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. ” బొత్స మద్యం మాఫియా కింగ్. అందులో సందేహం లేదు. తమ కుటుంబానికి 31 మద్యం షాపులు ఉన్నాయని గతంలో ఆయనే చెప్పారు. అటువంటి మూలవిరాట్‌లను వదిలేస్తున్నారు” అని ధ్వజమెత్తారు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా మళ్ళీ బివి రాఘవులు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా బివి రాఘవులు మరోసారి ఎన్నికయ్యారు. 1997లో నల్గొండలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో తొలిసారి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన ఆయన తరువాత వరంగల్, అనంతపురంలలో జరిగిన రాష్ట్ర మహాసభల్లోనూ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు. ఖమ్మంలో జరుగుతున్న మహాసభల్లో ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీ అభివృద్ధి దృష్ట్యా మరోసారి రాఘవులునే రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవాలని రాష్ట్ర మహాసభ భావించి తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కాగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా పాటూరి రామయ్య, తమ్మినేని వీరభద్రం, పి మధు, ఎస్ పుణ్యవతి, ఎంఏ గఫూర్, వి కృష్ణయ్య, వై వెంకటేశ్వరరావు, సిహెచ్ నర్సింగరావు, ఎస్ వీరయ్య, సారంపల్లి మల్లారెడ్డి, సిహెచ్ సీతారాములు, జి నాగయ్య, మిడియం బాబురావు, సి రాములు ఎన్నికయ్యారు. వీరితోపాటు మరో 66మందిని రాష్ట్ర కమిటీ సభ్యులుగా, ఐదుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా బిఆర్ తులసీరావు, సభ్యులుగా హరికిశోర్, రత్నమాలను ఎన్నుకున్నారు. గత కమిటీలోని వి శ్రీనివాసరావు, జక్కా వెంకయ్యలను తొలగించి వారి స్థానంలో మిడియం బాబురావు, రాములును ఎన్నుకున్నారు.

ఐక్యతకే ప్రాధాన్యం: రాఘవులు

సోదర కమ్యూనిస్టు పార్టీలతో వైరుధ్యాలకంటే ప్రజాసమస్యలపై ఐక్యంగా కలిసి పోరాడేందుకే ప్రాధాన్యమిస్తామని తిరిగి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన అనంతరం బివి రాఘవులు మీడియా సమావేశంలో చెప్పారు. మూడురోజుల పాటు ఖమ్మంలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. మద్యం మహమ్మారిని పారదోలేందుకు సమగ్ర చట్టం తేవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీలు పెంచితే 2000వ సంవత్సరం తరహా ఉద్యమం మరోసారి పునరావృతం అవుతుందని హెచ్చరించారు. ప్రజాసమస్యలపై శాసనసభలో కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని అవలంబించాలని, ప్రజలను ఆదుకునేందుకు ప్రయత్నించాలని, లేనిపక్షంలో ప్రజలందరినీ సమీకరించి ఆందోళనలు చేస్తామని రాఘవులు హెచ్చరించారు.

ఎర్రజెండాలను ఏకంచేస్తాం!
ప్రతినిధి:రాష్ట్రంలోని ఎర్రజెండాలన్నింటిని ఒకచోటికి తీసుకొచ్చి ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఉవ్వెత్తున ఉద్యమించి తద్వారా ప్రజల మద్దతును కూడగట్టు కొని వచ్చే ఎన్నికల్లో రాష్ర్ట రాజకీయాలను శాసించే స్ధాయికి ఎదగాలని సీపీఎం పార్టీ రాష్ట్ర23వ మహా సభలు నిర్ణయించాయి. మూడు రోజులపాటు ఖమ్మంలో జరిగిన సభలు శనివారం రాత్రి జరిగి బహిరంగసభతో ముగిశాయి. సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్‌కారత్‌, పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందాకరత్‌, ఏచూరి సీతారామ్‌ మూడురోజులపాటు ఖమ్మంలో ఉండి బహిష్యతు కార్యచరణపై కసరత్తుచేశారు. కాంగ్రెస్‌, బిజెపి ఆర్ధిక విధానాలకు, అవినీతి కి వ్యతిరేకంగా ప్రత్యామ్నయంగా ప్రజాతంత్ర లౌకిక శక్తులను కూడగట్టి భవిష్యత్తు పోరాటాలను నిర్వహించాలని ప్రధానంగా నిర్ణయించారు.ఇందుకు వామపక్షాల మద్య ఉన్న వైరుద్యాలను తగ్గించేందకు కృషిచేయాలని నిర్ణయిం చారు.

సిద్ధాంత పరమైన విభేదాలు కాకుండా ప్రజాల సమస్యలపై కలిసి పోరాడేందుకు అడ్డుగాఉన్న చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి ఉమ్మడి గా కలిసి పనిచేయాలని సభలు పార్టి శ్రేణులను నిర్ధేశించాయి. సిపిఐతోపాటు న్యూడెమెక్రసి,ఎంసిపిఐ ఇతర ఎర్రజెండా పార్టీలు మొత్తం 11 పార్టీలను ఒకతాటిపైకి తీసుకోచ్చే ప్రయత్నం జరుగుతుందని ఇప్పటికే ఒక ధప సమావేశం జరిగిందని రెండో ధఫాగా ఈనెల15న మరోసారి సమావేశం అయ్యి ఒక అభిప్రాయానికి రానున్నామని కనుకభవిష్యత్తులో కాంగ్రెస్‌,బిజెపిలకు వ్యతిరేకంగా వామపక్ష కూటమి గట్టిగా పనిచేయాలని ,అవసరం అయితే కలిసివచ్చే కొత్త శక్తులను కలుపుకోని పోవాలని కూడా తీర్మాణించారు.

రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఘోరంగా ఒడిపోయి ఒకసీటకుపరిమితం కావడం,అటూ పశ్చిమ బెంగాల్‌,కేరళ రాష్ట్రంలో పార్టీ ఓడిపోవడంతో సిపిఎం బలహినపడిందనే అభిప్రాయం తో ఉన్నవారికి ఈ మహాసభల ద్వారా తాము బలంగా ఉన్నామనే ప్రయత్నంచేశారు.మూడురోజులపాటు జరిగిన సమావేశాలకు 765మంది ప్రతినిధులు హజర్‌కావడం,చివరిరోజు బహిరంగసభకు పెద్ద ఎత్తున్న జనం తరలిరావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలేసింది.ఇన్నాళ్లు నిరుత్సాహంతో ఉన్న శ్రేణుల్లో ఈ సభలు టానిక్‌లా పనిచేశాయని చెప్పవచ్చు.ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో 2009 ఎన్నికలకు ముందు సిపిఎం అసమ్మతినేతలంతా పార్టీపై బురద జల్లి బైటికి వెళ్ళిపోయారు. ఆతరువాత వచ్చిన ఎన్నికల్లో టిడిపి పొత్తుతో నాలుగు స్ధానాల్లో పోటిచేస్తే అన్నింట్లో అపజయం ఎదురైంది.

అనాటి నుంచి ఆపార్టీలో కొంత స్ధబ్ధత నెలకొంది.పార్టీ క్యాడర్‌నిస్తేజంలో మునిగింది.ఈ పరిస్థితిలో జరిగిన మహాసభలు వారిలో మళ్ళి ఉత్తేజాన్ని నింపినట్లయింది.జిల్లాతో తమ బలం తగ్గాలేదు ఇంకా పెరిగిందని ఈసభతో చాటిచెప్పినట్లయింది,ఇదే విషయాన్ని పార్టీ కేంద్ర కమిటి సభ్యుడు తమ్మినేని వీరభద్రం బహిరంగసభ వేదికపైనే ప్రకటించారు.తమ పార్టీని నాశనంచేయాలనుకున్నేవారంతా కాలగర్బంలో కలిశారని ప్రజలకు దూరం అయ్యారన్నారు.ఈ సభకు తరలివచ్చిన జనం ను చూసి పోలీటూబ్యూరో సభ్యులు ఏచూరి సీతరామ్‌ చైనాలో అనాడు యానం నుంచి చైనా విప్లవం బయలుదేరిందని భారత దేశంలో ఖమ్మంనుంచే నూతన వామపక్ష విప్లవం ప్రారంభంకావాలని అక్షాంక్షించారంటే సభ విజయం ఏలా జరిగిందో చెప్పవచ్చు.

ఇది ఇలా ఉండగా ప్రపంచకీరణతో కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతున్నందునా కొత్త సంఘాలను ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత పెరిగిందని,పార్టీ అధ్యాయన కేంద్రాలను జిల్లా కేంద్రాలకే పరిమితం చేయకుండా మారుమూల ప్రాంతాలకువిస్తరింపజేసి పార్టీ పనితానాన్ని పెంచాలనిఈ మహాసభలు నిర్ణయించాయి.ప్రజా సమస్యలపై మొత్తం 45కిపైగా తీర్మాణాలు చేసి ప్రజల కోరికల పత్రాన్ని తయారుచేశారు.ఈ సమస్యల పరిష్కారం కోసం బలమైన ఉద్యమాలను నిర్మించాలని తీర్మాణించారు.ప్రాజెక్టుల సాధన కోసం జలసాధనపేరుతో ఉద్యమించాలని,కార్మికుల సమస్యలపై ఈనెల28న జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నాలని తీర్మాణించాయి.

పొత్తులు,సీట్ల సర్ధుబాట్లు ఇప్పుట్లో ఎన్నికలు లేనందునా పెద్దగా చర్చంచలేదని తెలిసింది.అయితే గత ఎన్నికల్లో టిడిపితో పొత్తుపెట్టుకొని పొరపాట్లుచేశామని ,టిడిపినేతల సహకారం లేకపోవడంతో చాలా చోట్ల ఓడిపోయామనే విశ్లేషణచేసినట్లు సమాచారం.పిఆర్‌పితో పొత్తుపెట్టుకొని ఉంటే బాగుండేదనే అభిప్రాయంకూడా వ్యక్తంఅయ్యింది.వామపక్ష కూటమి వంద స్ధానాలపై గురిపెట్టి పోటీ చేసి రాష్ట్ర రాజకీయాలను శాసించేస స్ధాయికి ఎర్రజెండాల బలం పెరగాలని సమావేశం అభిప్రాయపడినట్లు తెలిసింది.కొత్తపార్టీలు పుట్టుకొచ్చినప్పటికి ఎన్నికల సమయంలో వాటిపై దృష్టిసారించాలని నిర్ణయించారు.కొన్నిజిల్లాలో పార్టీ పనితీరు సరిగ్గాలేదని కూడా అంచనావేశారు.2014 ఎన్నికలనేపద్యంలో సుదీర్ఘరాజకీయ అనుభవం ఉన్న బివి రాఘవులకే మళ్ళి పార్టీ బాధ్యతలను అప్పగించారు.గత ఎన్నికల్లో ఒకే స్ధానానికి పరిమితం అయినప్పటికి ఆయననే ఎంపికచేశారు.

తెలంగాణ ఉద్యమం జరుగుతుండటం తో పార్టీ నూతన కమిటీలో తెలంగాణ వారికి పెద్దపీఠ వేశారు. నూతన రాష్ట్ర కమీటిలోకి ఏడుగురికి స్ధానం కల్పించినప్పటికి వారంతా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కావడం గమనర్హం.పార్టీ సెక్రట్‌యేట్‌ కమిటీలో కొత్తగా ఇద్దరికి అవకాశం కల్పించగా వారిని తెలంగాణ నుంచే తీసుకున్నారు.కార్యవర్గంలో ఐదుగురికిస్ధానం కల్పిస్తేవారంతా కూడా తె లంగాణ వారే.ఈసారి తెలంగాణ ప్రాంతానికే రాష్టక్రార్యదర్శి పదవిని కట్టబెడ్తారని అంతా భావించారు.కాని కమీటీలో ఎక్కువప్రాతినిధ్యం కల్పించారు.మొత్తంమీద మూడు రోజులపాటు ఉత్సాహవాతవరణంలో ఉత్తేజంగా సిపిఎం మహాసభలు విజయవంతంగా మూగిసాయి.

సమ్మె విరమించాకే చర్చలు – డీఎల్
“ముందు మీరు సమ్మె విరమించి, విధులకు హాజరుకండి. ఉదయం 11 గంటల నుంచి సచివాలయంలో మీతో చర్చించడానికి అందుబాటులో ఉంటా” అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి జూనియర్ వైద్యులకు సూచించారు. ’132 జీవో కావాలో, 287 జీవో కావాలో ముందు తెల్చుకోవా’లని స్పష్టం చేశారు. నెలనెలా స్టైపెండ్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. జూనియర్ వైద్యుల సమ్మె రాజకీయ ప్రేరితంగా కొనసాగుతుందని, వారి చర్చల్లో పొంతన ఉండడం లేదని ఆరోపించారు.

132 జీవో అమలు కావాలో, 287 జీవో కావాలో తేల్చుకోవాలని ఆయన జూనియర్ వైద్యులకు సూచించారు. “వారి సమస్యలను పరిష్కారిద్దామని మూడు సార్లు చర్చలు జరిపా. డిమాండ్ల విషయంలో కొంత సానుకూలత వచ్చింది. అయితే.. రెండు గంటల సమయం అడిగి వెనక్కి వెళ్లిపోయారు. వారికి ఈ సమాజం పట్ల బాధ్యత లేదా” అని డీఎల్ ప్రశ్నించారు. ‘ఎవరో ఏదో చెప్పాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మాట్లాడిస్తే ఎలా! అసలు జూనియర్ వైద్యులంటే ఎవరో ఆయనకు తెలుసా?’ అని డీఎల్ ఎద్దేవా చేశారు.

సీబీఐ ఎదుట ఐఏఎస్ రత్నప్రభ
భూ కేటాయింపులపై విచారణ

వైఎస్ హయాంలోని మేళ్లపై ఆరా

జగన్ కంపెనీల కేసు విచారణలో భాగంగా సీబీఐ ఎదుట శనివారం ఐఏఎస్ అధికారిణి రత్నవూపభ హాజరయ్యారు. 2004లో వైఎస్ రాజశేఖరడ్డి మొదటిసారి ముఖ్యమంవూతిగా పగ్గాలు చేపట్టిన తర్వాత రత్నవూపభ డిప్యూ కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చారు. ఆరేళ్లపాటు ఇక్కడే ఐటీ, పరిక్షిశమలు, రవాణా శాఖల కార్యదర్శిగా పనిచేశారు. ఆమె కార్యదర్శిగా పనిచేసిన కాలంలో పలు సంస్థలకు మేళ్లు కలిగిస్తూ జీవోలు జారీ అయినట్టుగా ఇప్పటికే సీబీఐ గుర్తించింది. దీంట్లో ప్రధానంగా ఏపీఐఐసీతో ఐటీ పార్కుల అభివృద్ధికి ఒప్పందం కుదుర్చుకున్న రహేజా సంస్థకు కలిగిన ప్రయోజనాలపై సమాచారాన్ని సేకరించింది. వాస్తవంగా 2002లో ఏపీఐఐసీ రహేజాతో ఒప్పందం కుదుర్చుకున్నపుడు లాభాల్లో ప్రభుత్వం వాటా 11 శాతంగా ఉంది. వైఎస్ రాజశేఖరడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 0.006 శాతానికి తగ్గిపోయింది.

ఆ సమయంలో రత్నవూపభ ఐటీ కార్యదర్శిగా ఉన్నారు. దాంతోపాటు విశాఖపట్నం, రంగాడ్డి, వరంగల్, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఐటీ కంపెనీలకు ఆమె ఐటీ కార్యదర్శిగా ఉన్నప్పుడే పెద్ద ఎత్తున భూ కేటాయింపుల జరిగాయి. కొన్ని ఐటీ సంస్థలకు సెజ్ హోదాలు లభించాయి. ఈ సంస్థలే జగన్ కంపెనీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్టుగా నిర్ధారించుకున్న సీబీఐ అధికారులు శనివారం సరిగ్గా ఈ అంశాలపైనే రత్నవూపభను విచారించారు. రహేజాతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఏపీఐఐసీ వాటా తగ్గిపోవటానికి కారకులు ఎవరు? ఎవవరి నుంచి ఒత్తిళ్లు వచ్చాయి? అన్న విషయమై వివరాలను సేకరించారు. ఐటీ కంపెనీలకు జరిగిన భూ కేటాయింపుల విషయమై ఆరా తీశారు. దాదాపు నాలుగు గంటలపాటు రత్నవూపభను విచారించిన తర్వాత తిరిగి పంపించారు.

ఆరేళ్లు డిప్యూ ఇక్కడే..!

కర్ణాటక కేడర్‌కు చెందిన రత్నవూపభ 2004లో డిప్యూ రాష్ట్రానికి వచ్చారు. 2010 వరకు ఇక్కడే ఆమె ఉన్నారు. డిప్యూ వచ్చినవారు మూడేళ్ల తర్వాత సొంత రాష్ట్రానికి వెళ్లిపోవాల్సి ఉన్నా ఆరేళ్లపాటు ఇక్కడే విధులు నిర్వర్తించారు. చివరకు హైకోర్టు ఆదేశాల మేరకు ఆమె తిరిగి కర్ణాటక వెళ్లిపోవాల్సి వచ్చింది.

విజయరాఘవన్, సునీల్‌డ్డి విచారణ

హైకోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు నిందితులు విజయరాఘవన్, సునీల్‌డ్డిలను శనివారం సీబీఐ అధికారులు దిల్‌ఖుష్ గెస్ట్‌హౌస్‌లో విచారించారు. ఈ ఇద్దరిని ఉదయం గంటలకు చెంచల్‌గూడ జైలు నుంచి గెస్ట్‌హౌస్‌కు తీసుకువచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే విజయరాఘవన్‌కు జ్వరం రావటంతో వైద్యుడ్ని పిలిపించి చికిత్స జరిపించారు. కాగా, విజయరాఘవన్ తన అనారోగ్య పరిస్థితిని అడ్డం పెట్టుకుని సీబీఐ అధికారుల విచారణకు సహకరించలేదని తెలిసింది. సునీల్‌డ్డి కూడా సీబీఐ దర్యాప్తునకు పెద్దగా సహకరించలేదని సమాచారం. కీలక ప్రశ్నలు సంధించిన ప్రతిసారి తనకేం తెలియదని, తాను ఎలాంటి తప్పు చేయలేదని మాత్రమే సునీల్‌డ్డి జవాబులు ఇచ్చినట్టు తెలిసింది.

జైలుకు చేరిన ఆచార్య

అనారోగ్యంతో ఉస్మానియా ఆస్పవూతిలో చికిత్స పొందుతున్న ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు నిందితుడు, ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య శనివారం చెంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు. ఈనెల 2న చెంచల్‌గూడకు తరలించిన కొద్దిసేపటికే ఆయన అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దాంతో జైలు అధికారులు ఆచార్యను ఉస్మానియా ఆస్పవూతికి తరలించారు. రెండు రోజుల చికిత్సతో ఆచార్య పూర్తిగా కోలుకున్నారు.

12నుంచి శ్రీకల్యాణవెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించిన రీతిలోనే ఈ ఏడాది శ్రీనివాసమంగాపురంలోని శ్రీకళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను కనీ వినీ ఎరుగని రీతిలో నిర్వ హించాలని టి.టి.డి ఇ.ఓ ఎల్‌వి. సుబ్రమణ్యం అధికారులను ఆదేశించారు. శనివారం శ్రీనివాసమంగాపురంలోని టి.టి.డి కళ్యాణ మండపంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 12వ తేదిన ధ్వజారోహణంతో ప్రారంభమై, 20న ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలకు రాజీలేని విధంగా ఏర్పాట్లు చేసి తిరుమల బ్రహ్మోత్సవాలను తలపించేలా నిర్వహించాలని ఆదేశించారు.

బ్రహ్మోత్సవాల వివరాలు

టి.టి.డికి అనుబంధంగా వున్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీకళ్యాణవెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 12నుంచి 20వతేది వరకు జరగనున్నాయి. 11వతేది సాయంత్రం 5 గంటలకు అంకురార్పణం జరగనుంది. 12వ తేది ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం పెద్దశేషవాహనం, 13న ఉదయం చిన్నశేషవాహనం, సాయంత్రం హంసవాహనం, 14న ఉదయం సింహవాహనం, సాయంత్రం ముత్యపుపందిరి వాహనం, 15న ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వభూపాలవాహనం, 16న ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం గరుడవాహనం, 17న ఉదయం హనుమంతవాహనం, సాయంత్రం గజవాహనం, 18న ఉదయం సూర్యప్రభవాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహనం, 19న ఉదయం రథోత్సవం, సాయంత్రం అశ్వవాహనం, 20న ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజావరోహణం. గరుడసేవ రోజున ఆండాళ్‌ అమ్మవారి ప్రత్యేక ఆభరణాలను తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం నుంచి నగర సంకీర్తనగా కాలినడకన శ్రీనివాసమంగాపురానికి తీసుకురానున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రోజువారీ సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను రద్దు చేశారు. ఈ నెల 14వ తేదిన మంగళవారం నిత్య కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, స్వర్ణ పుష్పార్చన, 15వ తేదిన అష్టోత్తర శతకలశాభిషేకం, 16న తిరుప్పావడ సేవ, 17న మూలవర్‌ఒ అభిషేక సేవలు రద్దయ్యాయి. 9వ తేదిన కోయిల్‌ ఆళ్వార్‌ఒ తిరుమంజనం సందర్భంగా తిరుప్పావడ సేవను రద్దు చేశారు. ఈ సందర్భంగా టి.టి.డి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాస సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజె క్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

దేవుడి శక్తిని శంకించరాదు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి బలాన్ని ఎవరు శంకించినా అది మానవుడు చేసే అతిపెద్ద తప్పిదం అవుతుందని టిటిడి ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, పాలకులు, ఆలయ కైంకర్యాలు, చారిత్రక కట్టడాలపైనా త్రిదండి చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై టిటిడి తొలిసారిగా తీవ్రస్థాయిలో స్పందించింది. టిటిడి ఇఓ సుబ్రహ్మణ్యం శనివారం విలేఖరులతో మాట్లాడుతూ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి విశ్రాంతి లేదని జీయర్ వ్యాఖ్యానించడం, 10 గంటలకే ఆలయం మూసివేయాలని చెప్పడం సరికాదన్నారు. స్వామివారికి కానీ, తిరుమల క్షేత్రానికి కానీ కళంకం ఏర్పడితే తాను ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు. ఆలయంలో ఏవైనా లోపాలు జరుగుతోంటే పెద్దలు తమ దృష్టికి తీసుకువస్తే తాము ఎలాంటి భేషజాలకు పోకుండా సరిదిద్దుకుంటామన్నారు. భక్తులను అనుగ్రహించడం కోసమే స్వామివారు కలియుగంలో వెలిశారన్నారు. ఆయన శక్తిసామర్థ్యాల గురించి మాట్లాడటానికి మన స్థాయి ఏ పాటిదన్నారు. నిజంగా స్వామివారి ఆలయంలో తప్పిదాలే జరుగుతూ ఉంటే, స్వామివారికే ఆగ్రహం వస్తే ఈ క్షేత్రం నడవగలదా అని ప్రశ్నించారు. ఎంత సమయం కేటాయిస్తున్నా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోతోందన్నారు. ఇక రాత్రి 10 గంటలకే ఆలయం మూస్తే భక్తులు ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారో ఊహించలేమన్నారు. ఎక్కువ మందికి దర్శనం కల్పించేందుకు శ్రీవారి ఆలయం లోపల ఏవైనా మార్పులు, చేర్పులు చేద్దామనుకుంటే అందుకు ఆగమాలు ఏమాత్రం అంగీకరించవన్నారు. ఆగమాలను పాటించే సాంప్రదాయం వల్లనే మార్పులు చేయడానికి కూడా టిటిడి ఎప్పుడూ సాహసించలేదన్నారు. వెయ్యికాళ్ల మండపం నిర్మాణానికి ఆగమాలకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. దానిని ఆగమాలకు ముడిపెట్టి ఎవరైనా మాట్లాడితే వారిని ఆ భగవంతుడే కాపాడాలని జీయర్‌పై చురకలు వేశారు. కాలానుగుణంగా పెరుగుతున్న రద్దీని బట్టి భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత, అధికారం టిటిడికి ఉందన్నారు. ప్రస్తుతం ఆలయం సమీపంలో రాంభగీచ అతిథి భవనాలు ఉన్నాయని, భక్తుల అవసరాలు పెరిగితే వాటిని కూల్చివేసి మరో విష్ణ్భుగీచగా నిర్మాణం చేపడతామన్నారు. అలాగే స్వామివారి వాహన ఊరేగింపు సమయంలో ప్రస్తుతం ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపం అడ్డువస్తే, అవసరమైతే వాటిని హథీరాంజీ మఠం వరకూ తొలగించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందన్నారు. అలా అని హథీరాంజీ మఠంలో స్వామివారు పాచికలు ఆడారని చెబుతూ, ప్రస్తుతం భగవంతునికి సంబంధించి సౌకర్యాలను విస్మరించగలమా అని ప్రశ్నించారు. జీయర్ ప్రదర్శించిన 110 తప్పుల సిడిపై విలేఖరులు ప్రశ్నించగా… చిన్నజీయర్‌తో తాను నాలుగున్నర గంట పాటు సమావేశం అయిన విషయం నిజమేనన్నారు. అయితే 2003లో అప్పటి ఇఓ అజయ్‌కల్లాం, జెఇఓ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడిన వీడియో టేపులను చూపించారన్నారు. అందులో సంభాషణలు సరిగ్గా వినపడలేదని, ఆడియో కూడా సక్రమంగా లేదన్నారు. అంతమాత్రాన వారేదో తప్పులను ఒప్పుకున్నట్టు కాదుకదా.. అని ప్రశ్నించారు. ఓర్పుతో ఉన్నాను, ఇక కడిగేస్తాను అని చిన్నజీయర్ లాంటి పెద్దలు వ్యాఖ్యానించటం సరికాదన్నారు. హిందుమత పెద్దలుగా ఉన్న వారు విరుద్ధంగా మాట్లాడి అలజడులు సృష్టించడం సరికాదన్నారు. అలా చేయడం ద్వారా ఇతర మతస్థులకు మనం చేయూతనిచ్చిన వారమవుతామన్నారు. జీయర్ స్వామిపట్ల తనకు అపారమైన గౌరవం, భక్తి ఉన్నాయన్నారు. ఆయన తపస్సంపన్నులన్నారు. తాను పామరుడ్ని అన్నారు. తనపై ఆగ్రహించకుండా అనుగ్రహించాలని తాను పెద్దలను కోరుతున్నానన్నారు.

చిదంబరానికి క్లీన్‌చిట్‌
లక్షా 76 వేల కోట్ల రూపాయిల 2-జి కుంభకోణంలో కేంద్ర హోం మంత్రి పి.చిదంబరాన్ని సహనిందితునిగా చేర్చాలని కోరుతూ జనతాపార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు శనివారంనాడు కొట్టి వేయడంతో ఆయనకే కాక, యూపీఏ ప్రభుత్వానికే ఊరట లభించింది.కాగా,ప్రత్యేక కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేస్తానని డాక్టర్‌ స్వామి ప్రకటించారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఒపి సైనీ సమర్ధుడేననీ, కేసులో పస లేకపోవడం వల్లే పిటిషన్‌ని కొట్టి వేశారేమోనని న్యాయశాస్త్ర నిపుణుడు సోలీ సోరాబ్జీ వ్యాఖ్యానించారు. న్యాయం గెల్చిందని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించగా, అసత్య ఆరోపణలు చేసినందుకు చిదంబరానికి ప్రతిపక్షాలు సారీ చెప్పాలని కేంద్ర మంత్రి కపిల్‌ సిబాల్‌ డిమాండ్‌ చేశారు. దీనిపై ప్రధానమంత్రి పెదవి విప్పాలని సిపిఎం నాయకుడు నీలోత్పల్‌ బసు డిమాండ్‌ చేశారు. కాగా, రాజాపై డాక్టర్‌ స్వామి చేసిన ఆరోపణలపై విచారణను మార్చి 17వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ప్రత్యేక కోర్టు తీర్పు వెలువడటానికి ముందు కొద్ది గంటల సేపు నరాలు తెగే ఉత్కంఠ కొనసాగింది. తీర్పు చెప్పే ముందు న్యాయమూర్తి కోర్టు హాలు నుంచి విలేఖరులనూ, మీడియా ప్రతినిధులనూ, లాయర్లనూ వెళ్ళి పొమ్మనమని ఆదేశించడంతో చిదంబరానికి వ్యతిరేకంగా తీర్పు రావచ్చునన్న ఊహాగానాలు వ్యాపించాయి. చిదంబరం కూడా తీవ్ర ఆందోళనకు గురి అయినట్టు వార్తలు వెలువడ్డాయి. తీర్పు వెలువరించడానికి న్యాయమూర్తి 30 నిమిషాల వ్యవధి తీసుకోవడంతో అందరిలో సహజంగానే ఉత్కంఠ పెరిగింది.

డాక్టర్‌ స్వామి పిటిషన్‌ని కొట్టి వేసినట్టు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సైనీ ప్రకటించగానే, చిదంబరమే కాక, యూపీఏ నాయకులు తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. చిదంబరాన్ని ఈ కేసులో సహనిందితునిగా చేర్చడానికి తగినన్ని ఆధారాలు లేవని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసులో ఇంతకుముందే అరెస్టు అయి ఏడాది నుంచి జైలు జీవితం గడుపుతున్న మాజీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి ఎ రాజాతో చిదంబరం కుమ్మక్కయ్యారనడానికీ, ఇద్దరూ కలిసి కుట్రపన్నారనడానికి తగిన ఆధారాలు లేవని కూడా న్యాయమూర్తి పేర్కొన్నారు.వీరిలో ఒకరు ఉద్దేశ్యపూర్వకంగా నేరానికి పాల్పడినట్టు, మరొకరు అమాయకంగా ఇరుక్కుపోయినట్టు నిరూపించేందుకు కూడా ఆధారాలు లేవని న్యాయమూర్తి పేర్కొన్నారు.

కాగా, 2001లో ఎన్‌డిఎ ప్రభుత్వం నిర్ధారించిన రేటుకే స్పెక్ట్రమ్‌ లైసెన్స్‌లను ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికగా కేటాయించాలని ట్రాయ్‌ సిఫార్సు చేసిన నేపధ్యంలో ఆనాటి కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రాజా ఆ సిఫార్సును అమలు జేశారు. తనపై స్వామి వేసిన పిటిషన్‌ని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కొట్టి వేయడం పట్ల చిదంబరం హర్షం వ్యక్తం చేశారు. సత్యం ఎప్పటికైనా గెలుస్తుందని ఆయన అన్నారు. చిదంబరంపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆయనకు ప్రతిపక్షాలు క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి కపిల్‌ సిబాల్‌ డిమాండ్‌ చేశారు.