అంకుశం దిన దినాభివృద్ధి చెందాలి – ఎస్.వి. ప్రసాద్
చిన్న పత్రికలలో పెద్ద పత్రికగా అంకుశం ప్రతిక దినా దినాభివృద్ధి చెందాలని చీఫ్ సెక్రటరి ఎస్.వి. ప్రసాద్ అకాంక్షించారు. ఈ రోజు సాయంత్రం సచివాలయంలో అంకుశం యుగాది-2010 క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎస్.వి. ప్రసాద్ మాట్లాడుతూ పత్రికా రంగంలో చిన్న పత్రికలలో అంకుశంకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, నిజాలను నిర్భయంగా రాస్తూ అవినీతిపై అక్షర సమరం చేస్తుంది.. రాబోయే కాలంలో కూడా ఇలాగే కొనసాగుతూ జర్నలిస్టుల విలువలను ఇనుమడింప చేసేలా వార్తలను ప్రచురిస్తూ మంచి గుర్తింపును, అభివృద్ధిని సాధించాలని మనసారా కోరుకుంటున్నానని చీఫ్ సెక్రటరి ఎస్.వి.ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంకుశం పత్రిక చీఫ్ ఎడిటర్ మచ్చా రామలింగా రెడ్డి, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు.




