అంతర్జాతీయ బిడ్డింగ్‌తో కేటాయించాలి – లోక్‌సత్తా

గనుల మాఫియా నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి రాష్ట్రంలోని గనుల లీజులన్నీ రద్దు చేయాలని, అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్ ద్వారా తిరిగి కేటాయించాలని లోక్‌సత్తా పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అంతర్జాతీయ బిడ్డింగ్ ధర ప్రాతిపదికన రాయల్టీతోపాటు, అనూహ్యంగా పెరిగే లాభాలకు అనుగుణంగా విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను కూడా వసూలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.
పరిశ్రమలు నెలకొల్పుతున్నారనే సాకుతో ఓబుళాపురం మైనిం గ్ కంపెనీ, రక్షణ స్టీల్స్ వంటి సంస్థలకు మైనింగ్ లూటీ చేసే అవకాశం కల్పించారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కటారి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. బుధవారం విలేఖరులతో ఆయన మాట్లాడారు. గనుల చట్టంలో సవరణల కోసం తగు సూచనలతో తమ పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్ ప్రధానికి లేఖ రాయనున్నారని వెల్లడించారు.




