అంతర్రాష్ట ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్‌

జిల్లా కేంద్రంలోని వివిధ కంపెనీలకు చెందిన ద్విచక్ర వాహనాలు దొంగలించి నగరంలో, ఇతర ప్రాంతాల్లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠాను సిసిఎస్‌, 3వ పట్టణ పిఎస్‌ సిఐలు ఎస్‌. రామచంద్రారెడ్డి, శివనారాయణస్వామి, ఎసై్సలు తేజేశ్వర్‌రావ్‌, మన్సూరుద్ధీన్‌ వారి సిబ్బంది కలిసి పట్టుకున్నారు. అరెస్ట్‌ అయిన ఇద్దరు నిందితుల నుండి రూ. 2.5లక్షలు విలువ చేసే ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబందించిన మరిన్ని వివరాలను బుధవారం సాయంత్రం స్థానిక త్రిటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వెల్లడించారు. పట్టుబడ్డ దొంగలు తాడిమర్రి మండలం దాడితోట గ్రామానికి చెందిన గొల్ల మధుసూధన్‌, శింగనమల మండలం సలకంచెరువు గ్రామానికి గాండ్ల హరినాథ్‌ల నుండి 5 హిరో హోండా బైకులు, ఒక టివిఎస్‌ మ్యాక్స్‌ 100 మోటర్‌ బైక్‌, ఒక బజాజ్‌ సిటి 100 సిసి బైకులను స్వాధీనం చేసుకున్నారు.  ఈ దొంగల ఇరువురి నేర ప్రవృత్తి ఇలా మొదలుపెట్టరంటే… వీరిద్దరు వృత్తి రిత్య మోటర్‌ ద్విచక్ర వాహన మెకానిక్‌లు. వీరు చిన్నతనంలోనే ఇంటిని వదిలి జిల్లా కేంద్రంలో చేరి మోటర్‌ సైకిళ్ల మెకానిజంను నేర్చుకున్నారు. ప్రస్తుతం ఇరువురు స్వంతంగా నగరంలో వేరు వేరు ప్రాంతాల్లో మెకానిక్‌ షాపులు నడుపుతున్నారు. చెడు వ్యసనాలకు బానిసై ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న సమయంలో వీరికి బైకులను దొంగలించాలనే దురాలోచనతో వీరు మన రాష్ట్రంలోనే కాకుండా కర్నాటక ప్రాంతాలైన బాగేపల్లి, చిక్‌బళాపూర్‌ ప్రాంతాల్లో కూడా ద్విచక్రవాహనాలను దొంగలించడం మొదలుపెట్టారు. వీరిరువు మెకానిక్‌లు కావడంతో దొంగలించిన బైక్‌ల పార్ట్‌‌సను వివిధ భాగాలుగా చేసి సులువుగా అమ్మడానికి సిధ్దంగా వుంచుతారు.  పోలీసులకు పట్టుపడ్డుపడిందిలా… నగరంలో ఇటీవల కాలంలో అనేక ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్నందున పోలీస్‌ ఉన్నతాధికారులు వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి సిసిఎస్‌, త్రిటౌన్‌ పోలీసులు రంగంలోకి దింపారు. బుధ వారం మధ్యాహ్నం అందిన సమాచారం మేరకు సాయంత్రం స్థానిక నడిమివంక సమీపంలో ఈ దొంగల ముఠా బైక్‌లను విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు ఆ ముఠాను పట్టుకున్నారు. పట్టుకున్న వారిలో త్రీటౌన్‌ ఎసై్స మన్సూరుద్ధీన్‌, పిసీలు రాజు, రమేష్‌ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మనీష్‌కుమార్‌ సిన్హా ఈ బృందాన్ని అభినందించారు.

Leave a Reply

free website analytics