అట్టుడికిన లోక్‌సభ

parlimentమహిళా రిజర్వేషన్‌ బిల్లుపై వరుసగా మూడవ రోజు బుధవారం కూడా లోక్‌సభ అట్టుడికిపోయింది. రాజ్యసభలో తమ సహచరుల సస్పెండ్‌పై ఎస్‌పీ, ఆర్‌జెడీ, జెడీ(యూ) సభ్యులు పెద్ద ఎత్తున గలభా సృష్టించారు. గందర గోళం వల్ల సభలో ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. రెండు సార్లు సభ వాయి దా పడింది. మధ్యాహ్నం రెండు గంటలకు సభ తిరిగి సమావేశమైంది. బుధవారం సభలో కేవలం ఒక్క ప్రశ్నపై మాత్రమే చర్చించారు. సభ ప్రారంభం కాగానే ఎస్‌పీ, ఆర్‌జెడీ, జెడీ(యూ)లకు చెందిన ములాయంసింగ్‌ యాదవ్‌, లాలూప్రసాద్‌, శరద్‌యాదవ్‌ సభా మధ్యంలోకి వెళ్లి కార్యకలాపాలకు ఆటంకం కలిగించారు. ‘మార్షల్స్‌కు బులావో’ మార్షల్స్‌ను పిలవండి అంటూ పెద్ద ఎత్తున కేకలు వేశారు.
మంగళవారం రాజ్యసభలో తమ సహచరులను మార్షల్స్‌తో గెంటివేసినందుకు నిరసనగా వారు స్పీకర్‌ ముందు నిరసన తెలిపారు. స్పీకర్‌ ప్రశ్నోత్తరాల సమయాన్ని వాయిదా వేశారు. సభ్యుల ఆగ్రహావేశాలతో కాగితాలను చెల్లాచెదురుగా పడేసినా, స్పీకర్‌ మీరాకుమార్‌ మిన్నుకుండి పో యారు. వాటిని తీసేయమని సిబ్బందికి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. గందరగోళం జరిగేటప్పుడు ప్రధాని మ న్మోహన్‌సింగ్‌, యూపీఏ చైర్మన్‌ సోని యా, సభా నాయకుడు ప్రణబ్‌ముఖర్జీ, ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్‌ సభలోనే ఉన్నారు. సభ జరిగేటప్పుడు ములాయం, లాలూ సుష్మాస్వరాజ్‌ వద్దకు వెళ్లి రాజ్యసభలో తమ పార్టీకి చెందిన సభ్యులను సస్పెండ్‌ చేసిన విష యాన్ని, మార్షల్స్‌ ద్వారా గెంటివేసిన దానిపై సభలో ప్రస్తావించాలని కోరారు. బీజేపీ సభ్యుడు యశ్వంత్‌ సిన్హా రాష్టప్రతి వద్దకు వెళ్లి యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోండి అంటూ వారికి సలహా ఇచ్చారు.
క్షమాపణ ప్రసక్తేలేదు
మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై రాజ్యసభలో గందరగోళం సృష్టించి సస్పెండ్‌కు గురైన ఎస్‌పీ, ఆర్‌జెడీ,ఎల్‌జేపీ సభ్యులు రాజ్యసభలో తమ ప్రవర్తనకు క్షమా పణ చెప్పే ప్రసక్తే లేదన్నారు. తమ సభ్యత్వాలు పోయినా తాము మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ క్షమాపణ చెప్పమని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ కమల్‌అఖ్తర్‌ చె ప్పారు. మాజీ జెడీ(యూ) సభ్యుడు, ప్రస్తుతం ఏ పార్టీకి చెందని సభ్యుడు ఎజా జ్‌ అలీ మార్షల్స్‌ ద్వారా తమను సభ నుంచి గెంటించినందుకు ప్రభుత్వమే జాతి ముందు తమకు క్షమాపణ చెప్పాలన్నారు. అఖ్తర్‌ పార్లమెంటు కాంప్లెక్స్‌ వద్ద పత్రికల వారితో మాట్లాడుతూ, తాము పార్లమెంటు సభ్యులమని, ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చే బాధ్యత తమపై ఉందన్నారు. ప్రభుత్వం మహిళలకు, వెనుకబడిన తరగతులవారికి, ముస్లింలకు, దళితులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.
కల్యాణ్‌ బెనర్జీ వాదన తేలికగా తీసుకున్న సోనియా
న్యూఢిల్లీ : లోక్‌సభలో మహిళా బిల్లుపై గందరగోళం నెలకొనడంతో 20 నిముషాలు సభ వాయిదా పడింది. దీంతో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోని యాగాంధీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన కల్యాణ్‌ బెనర్జీ మధ్య ఆసక్తికర చర్చ చోటుచేసుకుంది. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలు చేస్తే పురుషుల ప్రాధాన్యత తగ్గిపోతుందని కల్యాణ్‌ బెనర్జీ వాదించారు. దీంతో ‘పురుషులకు కూడా రిజర్వేషన్లు ఇద్దామా ’ అంటూ కల్యాణ్‌ బెనర్జీ వాదనను సోనియా గాంధీ తేలికగా తీసుకున్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ ఇవ్వడంతో అసెంబ్లీ, లోక్‌సభ సాధారణ స్థానాలలో కూడా మహిళల ప్రాధాన్యత అధిక మవుతుందని అన్నారు. దీంతో మహిళల అధిపత్యం ఎక్కువ కావడంతో పు రుషులు దిగ్భ్రాంతికి లోనవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చర్చలో కాంగ్రెస్‌ నాయకులతో పాటు దాదాపు 30 మంది పాల్గొన్నారు. ‘ఇప్పటికి కూడా పురుషులే విజేతలని’ సోనియా గాంధీ అన్నారు. ఈ చర్చలో ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ కూడా ఉండడం విశేషం.

Leave a Reply

free website analytics