అనంతలో ఐఐఎస్సీ కేంద్రం – రఘువీరా

raghu
రాష్ట్రంలో వ్యవసాయ పరిశోధనలకోసం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రప్రభు త్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలి పారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో బెంగుళూరు విమానాశ్రయానికి 70 కిలోమీటర్ల దూరంలో వెయ్యి ఎకరాల భూమిని ఇందుకు అనువైన ప్రాంతంగా ఇదివరకే గుర్తించామన్నారు.ప్రొఫెసర్‌ మోహన్‌ నేతృత్వంలో ఇన్‌స్టిట్యూషన్‌ కమిటి పరిశీలన జరిపి ప్రతిపాదిత ప్రాం తం క్యాంపస్‌కు అనువైనదిగా తేల్చిందన్నారు.ఐ.ఐ.సి కేంద్రం ఏర్పాటుకు కేంద్ర మంత్రి కపిల్‌ సిబాల్‌ సానుకూలతను వ్యక్తంచేస్తూ ముఖ్యమంత్రి రోశ య్యకు లేఖకూడా రాశారన్నారు. ఈ కేంద్రం ఏర్పాటు ద్వారా వ్యవసాయ రం గానికి సంబంధించి కోర్సుల నిర్వహణ, ఫ్యాకల్టీ నియామకం, ప్రయోగశాల ఏర్పాటు పరిశోధనలకు అనుగుణంగా ఏర్పాటవుతాయని మంత్రి రఘు వీరారెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

free website analytics