అపెరల్ పార్కు పూర్తికి సహాయసహకారం అందిస్తాం కలెక్టర్ జనార్దన్‌రెడ్డి

అపెరల్ పార్కు పూర్తీకి సహాయసహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. హిందూపురం రూరల్ మండలంలోని అపీరియల్ పార్కును కలెక్టర్ జనార్దన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అపెరల్ పార్కు నిర్మాణనికి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా అన్నివిధాల కృషి చేస్తానని చెప్పారు. వీటి అభివృద్దికోసం దర్నాలు, దండం, దరఖాస్తు, దరావత్తు, ధన్యవాదాలు లేకుండా చూస్తానని అన్నారు. పనులను త్వరిత గతిన పూర్తీ చేయాలని తెలిపారు. నీరు, రోడ్డు, విద్యుత్ సౌకర్యాలు అనుకూలం అయ్యేలా చూస్తానని తెలిపారు. చైర్మన్ పల్లాఆదిశేషు మాట్లాడుతూ పార్కు అభివృద్ది కోసం కేంద్రం 40శాతం ఖర్చులు ఇస్తుందని తెలిపారు. ఇది మొత్తం 74ఎకరాలు స్థలంలో నిర్మిస్తున్నామన్నారు. దాన్ని 2012కి పూర్తీ చేస్తామన్నారు. ఇందులో 10వేలమంది దాకా ఉపాధి పొందవచ్చన్నారు. ముఖ్యంగా బెంగుళూరు వంటి ప్రదేశాలకు యువత వలస వెళ్ళకుండా ఇక్కడే ఉపాధి పొందడానికి వీలుటుందని తెలిపారు. అందరూ సామూహికంగా ఉంటే ప్రతిపని జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ అధికారి పద్మారావు, సంపత్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.




