ఆసీస్‌కు రెండో గెలుపు
న్యూజిలాండ్‌తో జరిగిన మూ డో వన్డేలో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్రాడ్‌హడిన్ అద్భుత సెంచరీ సాధించడంతో 246 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ మరో 16 బంతులు మిగిలివుండగానే 4వికెట్లు కోల్పోయి ఛేదిం చింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 46.2 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. టేల ర్ అత్యధికంగా 62 పరుగులు చేశాడు. మిగతావారిలో స్టయిరీస్ 41, హోప్‌కిన్స్ 45 పరుగులు చేశారు. ప్రత్యర్థి జట్టులో హోప్స్, జాన్సన్ మూడేసి వికెట్లు పడగొట్టారు. తర్వా త బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ను హడిన్ సెంచరీతో ఆదుకున్నాడు. ప్రారంభంలోనే నినాదం గా ఆడిన హడిన్ తర్వాత చెలరేగి పోయాడు. 121 బంతుల్లోనే 5సిక్స్‌లు, 7ఫోర్లతో 110 పరుగులు చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన పాంటింగ్ 9ఫోర్లతో 69 పరుగులు సాధిం చాడు. సునాయాస విజయం సాధించిన ఆ సీస్ సిరీస్‌లో 2-1 ఆధిక్యాన్ని సాధించింది.




