ఆ ముగ్గురి నిష్ర్కమణ

స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాిస్థాన్ టెస్టు జట్టు కెప్టెన్ సల్మాన్ భట్, మహమ్మద్ అమిర్, మహమ్మద్ ఆసిఫ్‌లపై ఇంగ్లండ్ జట్టుతో జరుగనున్న వన్డే, ట్వంటీ-20 టోర్నీలు ఆడకుండా వేటు పడింది. అయితే ఈ క్రీడాకారులు తమపై వచ్చిన స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా విపరీతమైన మానసిక ఒత్తిడిలో ఉండి తమంతట తామే వన్డే, ట్వంటీ-20 టోర్నీల నుండి వైదొలిగారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రటించింది. ఈ ప్రకటనతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటగాళ్ల పీసీబీ గట్టిగా సమర్ధించింది. అంతేగాకుండా ఈ ఆటగాళ్లందరూ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల నుండి బయటకు వచ్చే వరకు బోర్డు వారి వెంటే ఉంటుందని కూడా స్పష్టం చేసింది.
అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీసీ)తో పాటు, పీసీబీ, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అధికారుల మధ్య సుధీర్ఘ చర్చల అనంతరం ఈ పరిణామాలు సంభవించాయి. ఆరోపణలెదుర్కొంటున్న ఆటగాళ్లు వన్డే, ట్వంటీ-20 టోర్నీ నుండి తప్పించినట్లు తొలుత పాక్ క్రికెట్ జట్టు మేనేజర్ యావర్ సరుూద్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్ హై కమీషనర్ వాజిద్ ఎస్ హసన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెటర్లు తమంతటతామే ఇంగ్లండ్‌తో జరుగనున్న టోర్నీల నుండి వైదొలిగనుట్లు ప్రకటించడం గమనార్హం. అంతేగాకుండా ఈ క్రికెటర్లపై వచ్చిన ఆరోపణలు నిరూపితమయ్యేంతవరకు వారిని నిర్దోషులుగానే పరిగణిస్తామని కూడా ఆయన అన్నారు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ ఇంకా జరుగుతుందని హసన్ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
స్కాట్లాండ్ యార్డ్ నివేదికను పాక్‌తో పంచుకుంటాం: బ్రిటన్ హైకమీషనర్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెటర్లపై వచ్చిన స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలను దర్యాప్తు చేస్తున్న స్కాట్లాండ్ యార్డ్ పోలీసుల నివేదికను పాక్ దేశంతో పంచుకుంటామని పాిస్థాన్‌లోని బ్రిటన్ హై కమీషనర్ పీటర్ టిబ్బర్ గురువారంనాడు అన్నారు. పాకిస్థాన్ అంతరంగిక వ్వవహారాల మంత్రి రెహ్మాన్ మలిక్‌తో జరిగిన సమావేశం సందర్భంగా టిబ్బర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆసిఫ్ పై సాక్ష్యాల్ని ఐసీసీ కి అందజేసిన వీణా
లాహోర్: మాజీ ప్రియుడు పాక్ క్రికెటర్ మహమ్మద్ ఆసిఫ్‌కు బుకీలతో సంబంధాలున్నాయని తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాల్ని పాక్ మోడల్ వీణా మాలిక్ ఐసీసీకి సమర్పించింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి చెందిన అధికారి హసన్ రజాకు అందజేశానని ఆమె ఒక టీవీ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. అంతేగాకుండా తాను చేసిన ఆరోపణలన్నింటికీ కట్టుబడి ఉన్నానని కూడా వీణా తెలిపింది. మొత్తం పాకిస్థాన్ క్రికెట్ బోర్డే మ్యాచ్ ఫిక్సింగ్‌లో కూరుకుపోయి ఉందని మరోసారి వీణా మరోసారి పునరుద్ఘాటించింది. హసన్ రజా వీణాను బుధవారం సాయంత్రం ఆమె నివాసంలో కలిసారు.




