ఇది తెలుగువారికి జరిగిన అవమానం – జూ. ఎన్టీఆర్

ధర్మాబాద్ ఐటీఐ కళాశాలలో నిర్బంధంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతల పట్ల మరాఠా పోలీసులు అనుసరించిన తీరుకు బాగా కలత చెందినట్టు ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. ఈ ఘటన చాలా అమానుషం, బాధాకరమన్నారు. మంగళవారం ఆయన కులు-మనాలి నుంచి ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో ఫోన్‌లో మాట్లాడారు. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన.. ప్రస్తుత విపక్ష నేత చంద్రబాబు నాయుడు, మరో 74 మంది శాసనసభ్యులపై మరాఠాల దురుసు ప్రవర్తన, చివరకు మహిళా శాసనసభ్యులను కూడా బూట్లతో తన్నడం బాధాకరమన్నారు. ఇది తెలుగు వారికి జరిగిన అవమానంగా జూనియర్ పేర్కొన్నారు. కులు-మనాలీలో పెద్ద టీమ్‌తో ఉన్న తాను వెంటనే బయలుదేరి రాలేకపోయినందుకు ఆయన విచారం వ్యక్తం చేశారు. అందువల్లే మీడియా ద్వారా తన బాధను పంచుకుంటున్నట్టు జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు.




