ఎన్‌కౌంటర్ పోలీసులపై హత్యకేసు పెట్టాలి – గద్దర్

శాఖమూరిని, కొండల్ రెడ్డిని ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని ప్రజాగాయకుడు గద్దర్ డిమాండ్ చేశారు. వీరిద్దరినీ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత కాల్చి చంపారని గద్దర్ ఆరోపించారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జీ చేత విచారణ జరిపించాలన్నారు.




