ఎమ్మార్‌ కేసు ఏసీబీ ప్రత్యేక కోర్టుకు

EMMER
ఎపీఐఐసీ, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ రగడ ప్రస్తుతం ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) కు చేరింది. గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న కోట్లాది రూపాయల భారీ కుంభ కోణంపై న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే విచారణ జరిపి నిందితులను శిక్షించాలని న్యాయస్థానం ఏసీబీ అధి కారులను ఆదే శించింది. ఇందులో గతంలో పనిచేసిన మాజీఛైర్మన్‌ అం బటి రాంబాబు, ్రప్రిన్సిపాల్‌ సెక్రటరీ బీ.పీ. ఆచార్య, కట్టా పార్థసారధిరావులతో పాటు మరో పదహారు మంది ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉన్నతాధికారులే సూత్రధారులుగా ఆరోపణలు వెల్లువెత్తినా ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం శ్రీరంగారావు అనే న్యాయవాది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో కేసు వేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు.
దీనిపై సంబంధించిన వివ రాలను పరిశీలించిన న్యాయస్థానం ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ చెందిన ఆస్తుల, వ్యవహారాలు, వారికి ఉన్న లింకులను ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ అం శంలో అప్పట్లో ఎపీఐఐసీ ఛైర్మన్‌, అధికారులపై వచ్చిన ఆరోపణలపై విచా రణ జరిపి కేసు నమోదు చేయాలని ఎసీబీ న్యాయస్థానం పోలీసులను ఆదే శించింది. ఎమ్మార్‌ ఒప్పందంలో ఎపీ ఐఐసీ అవకతవకలకు పాల్పడిందని దీనికి బాధ్యులైన అప్పటి ఛైర్మన్‌ అంబటి రాంబాబు, ఎండీ బీపీ ఆచార్య, సలహాదారు పార్థసారధిపై చర్యలు తీసుకోవాలని న్యాయ వాది శ్రీరంగారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాంపల్లిలోని ఎసీబీ కోర్టు ఆదేశాలు జారీచేసింది.
ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ సహా 16 మంది వ్యక్తులు, 16 సంస్థలతో ఎపీఐఐసీ కుదు ర్చుకున్న ఒప్పందాల్లో అవినీతి చోటు చేసుకుందని దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు న్యాయ స్థానాన్ని కోరారు. పిటిషన్‌పై విచారణ జరిపిన ఏసీబీ న్యాయస్థానం ముగ్గురిపై అవినీతి నిరోధక చట్టంలోని 11, 12, 13 సెక్షన్లు, భారతీయ శిక్షా స్మృతిలోని 406, 420, 409, 120బి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ను ఆదే శించింది.
ఏసీబీ విచారణ ఎదుర్కొనే వారి వివరాలు ఈవిధంగా ఉన్నాయి…
బీపీ ఆచార్య, ప్రిన్సిపాల్‌ సెక్రటరీ, అంబటి రాంబాబు, మాజీ ఎపీఐఐసీ ఛైర్మన్‌, డి.పార్థసారధిరావు, రిటైర్డు అధికారి, మెస్సర్స్‌ ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, దుబాయ్‌, మెస్సర్స్‌ ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌ ల్యాండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, న్యూఢిల్లీ, ఎమ్మార్‌ హిల్స్‌ టౌన్‌షిప్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, వరుణ్‌ మోటార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌,అలీఫ్‌ రీసోర్స్‌ అండ్‌ ఇన ్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఏ ఆర్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, భువితేజా ఎంటర్‌ ప్రైజెస్‌(ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌,మ్యాక్‌ సొల్యూ షన్స్‌ ఇంక్‌, న్యూ ల్యాండ్‌ ల్యాబొరేటరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌,ఆర్‌యు సర్వీస్‌ సెంటర్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఫ్రాం క్లిన్‌ టెంపల్‌టన్‌ ఇంటర్నేషనల్‌, ఎస్‌ శ్రీరామ్‌ గ్రూప్‌ కంపెనీస్‌, ప్రకృతి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవల ప్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌.

Leave a Reply

free website analytics