ఎవడబ్బ సొమ్మని రాష్ర్టాన్ని దోచుకున్నారు – చంద్రబాబు

babu-tea
ఎవడబ్బ సొమ్మని కాంగ్రెస్‌ నాయకులు రాష్ర్టాన్ని దోచుకున్నారని తెలుగు దేశం పార్టీ అధినేత, కుప్పం శాసన సభ్యులు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.  మూడు రోజుల కుప్పం నియోజక వర్గ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు బుధవారం కుప్పం నియోజక వర్గంలో నిర్ణీత సమయంకన్నా రెండు గంటలు ఆలస్యంగా తన పర్యటనను ప్రారంభించారు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు విగ్రహాన్ని శాంతిపురం మండల కేంద్రంలో ఆవిష్కరించిన చంద్రబాబు ఆతరువాత జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ పూర్తిగా అవినీతిమయం అయ్యిందని.. లక్షల కోట్ల రూపాలయ ప్రజాదనాన్ని దోచుకుని కాంగ్రెస్‌ వాళ్లు ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేశారని దుయ్యబట్టారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయమంటు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ప్రజల సంక్షేమానాన్ని గాలికొదలి అందిన కాడికి దండుకుంటున్నారు.. నాటి ఇందిర నుంచి నేటి సోనియా వరకు అందరూ డబ్బుమనుషులేనని
దివంగ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తన వారికి వేలాది కోట్లరూపాయల ప్రభుత్వ భూములతో పాటు ఖనిజ సంపదను అప్పనంగా అప్పగించారని అవినీతికి ఆజ్యం పోశాడని విమర్శలు గుప్పించారు. వైఎస్‌ కుటుంబం లక్షల కోట్లుదండుకున్నారన్నారు. తెలుగు దేశం హయాంలో అభివృద్ధి పథంలో పరుగులు తీసిన కుప్పం నియోజక వర్గాన్ని అన్ని విధాలు ఇబ్బందులకు గురిచేశారని.. కుప్పానికి రాజశేఖర్‌ రెడ్డి తీరని ద్రోహం చేశాడంటు మండిపడ్డారు. అదేవిధంగా లక్షల కోట్లు విలుచేసే బయ్యారం గనులను వైఎస్‌ తన అల్లుడికి అప్పనంగా అప్పగించి.. ప్రభుత్వ ఖజానాకి భారీ గండికొట్టాడన్నారు. గాలిసోదరుల గనుల వ్యవహారంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తామని ఓ వైపు కాంగ్రెస్‌ అధిష్టానం పేర్కొంటుంటుంటే.. కర్ణాటకలో మాత్రం రావుల్‌ గాంధీ ప్రవర్తించిన తీరు యావత్తు భారత దేశాన్నే విస్మయానికి గురిచేసిందంటు.. కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు చెరిగారు.  కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి కొలివైవున్న తిరుమల పవిత్రతను కాంగ్రెస్‌ వాళ్లు మంటగలిపారని.. టిటిడి పూర్తిగా అవినీతిమయం అయ్యిందంటు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాసుడి బంగారు డాలర్లు దొంగల పాలవగ.. శ్రీ కృష్ణదేవరాయల వారు స్వామివారిని ఇచ్చిన బంగారు ఆబరణాలు మాయమయ్యాయని దీన్ని బట్టిచూస్తే తిరుమలలో అవినీతి అక్రమాలు ఏస్థాయిలో ఉందో ఊహించుకోవచ్చన్నారు.  అదేవిధంగా ఇందిర నుండి సోనియ వరకు అందరూ డబ్బుకోసం పాకులాడుతుండటంతో ప్రపంచదేశాలు భారత దేశాన్ని చులకనగా చూస్తోందని.. ఇది ప్రతి భారతీయుడ్నీ కలచివేసే విషయమన్నారు. రోశయ్య పాలన పసలేని పాలనగా తయారైందని.. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అంటు బాబు ప్రజలను ప్రశ్నించారు. కామన్‌ వెల్త్‌ గేమ్స్‌ని నిర్వహిస్తామని.. ఇందుకోసం స్టేడి యం లను నిర్మించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం 40వేల కోట్ల రూపాయల మంజూ రుచేసి వేల కోట్లు స్వాహాచేశారని.. దీంతో ్ర డల డబ్బులు కూడా వదలని అవినీతిపరులు మన దేశంలో ఉన్నారని ప్రపంచం మొత్తం వేలెత్తిచూపుతోంద న్నారు. ఓబులాపురం గనుల వ్యవహారంలో గాలిసోదరులకు వైఎస్‌ అండగా నిలచి.. వేల కోట్ల ఖనిజ సంపదను అమ్ముకున్నాడని విమర్శలు గుప్తించారు.

Leave a Reply

free website analytics