ఐపీఎల్‌కు సర్వం సిద్ధం
ఐపీఎల్ మూడో సీజన్‌ను విజయవం తంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని లీగ్ ఛైర్మన్ లలిత్ మోడీ అన్నారు. మార్చి 12న ప్రారంభమయ్యే మెగా టోర్నీకి ఆదరణ లభిస్తోందనే నమ్మకం ఉందన్నారు. అభిమానులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ముమ్మర ఏర్పాట్లు చేశామన్నారు. టోర్నీకి ఎటువంటి అవరోధాలు ఎదురుకావనే తాను భావిస్తున్నానని, చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. దేశంలోని టివి ఛానల్స్ తమ పంథాను వీడి టోర్నీకి ప్రచారం కల్పిస్తాయనే ధీమాను వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ కోరి న విధంగా తాము అన్నింటికి సమ్మతం వ్యక్తం చేసినా వారు మళ్లీ పాత పాట పాడుతున్నారన్నారు. ఇది తమను బాధించిందన్నారు. టోర్నీ ప్రారంభం నాటికి అన్ని సర్దుకుపోతాయనే నమ్మకం ఉందన్నారు. ఐపీఎల్-3 సీజన్‌లో పాల్గొనే అన్ని జట్లకు భారీ భద్రత కల్పిస్తామన్నారు.




