ఓట్ల లెక్కింపు వీడియో చిత్రీకరణ – ఐవీ సుబ్బారావు

ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఆద్యంతం వీడి యో చిత్రీకరణ జరపనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. “ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు), బ్యాలెట్ పెట్టెలు ఉన్న స్ట్రాంగ్‌రూమ్‌లలో సీసీటీవీ కెమెరాలను అమరుస్తున్నాం. లెక్కింపు ప్రక్రియను ఇవి రికా ర్డు చేస్తాయి,” అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐ.వి.సుబ్బారావు బుధవారం ఇక్కడ తెలిపారు.
ఓట్ల లెక్కింపులో పారదర్శకత కోసం తమ ఈ చర్య ఉపకరిస్తుందన్నారు. స్ట్రాంగ్ రూములు ప్రతి చర్యనూ మోషన్ సెన్సర్లు పసికడతాయన్నారు. ఈ నెల 30వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం 11గంటలకే వెలువడే అవకాశం ఉంది.




