ఓదార్పు అంటే… ఆర్థిక సాయమే కాదు – జగన్మోహన రెడ్డి

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకో లేక ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోని యాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని కడప ఎంపీ వైఎస్ జగన్మోహన రెడ్డి స్వాగతించారు. ఈ నిర్ణయం తీసుకు న్నందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఓదార్పు యాత్ర అవసరాన్ని, అందులోని నిజాయితీని అధిష్ఠా నం గుర్తించినట్టయిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోనియాగాంధీకి ఓ బహి రంగ లేఖ రాశారు. లేఖ పూర్తి సారాంశం ఇలా ఉంది…‘దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబా లకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. నేను కుటుం బంతో పర్యటనలో ఉన్నందువల్ల పత్రికల ద్వారా ఈ విషయం తెలుసుకున్నాను. ఎఐసిసి నాయకత్వం నుం చి వెలువడిన ఈ ప్రకటన రాష్ట్రంలోని పార్టీ శ్రేణులకు, వైఎస్ అభిమాను లకూ ఎంతో ఊరటనిచ్చింది. సరిగ్గా ఏడాది కిందట దురదృష్టకర సంఘటనలో మహానేత వైఎస్ చనిపోవడం రాష్ట్ర ప్రజలను తీరని వేదనకు గురి చేసింది. ఆ వార్తను తట్టుకోలేక వందలాది మంది ప్రా ణాలు కోల్పోయారు. కొందరు ఆత్మహత్య చేసుకున్నా రు. ఇంకెందరో టీవీల్లో వార్తలు చూస్తూ షాక్‌తో, వేదనతో గుండెపోటుకు గురై అశువులు బాశారు. వీళ్లందరూ కాంగ్రెస్ అభి మానులే. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావడానికి తోడ్పడిన వారే. ఎఐసిసి ప్రకటించిన సాయం వీరం దరికీ వర్తింపజేసి ఉంటే మరింత బాగుండేది. నా తండ్రికోసం ప్రాణాలు అర్పించిన ఆత్మబంధువుల కుటుంబాలను వారింటికి వెళ్లి పలకరించడం, ఆదుకో వడం మహానేత కుమారు నిగా నా కనీస ధర్మంగా భావించాను. గత ఏడాది సెప్టెంబర్ 25న నల్లకాలువ వద్ద జరి గిన వైఎస్ సంస్మరణ సభలో ఇదే విష యాన్ని ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలిసిందే.నేను ఇంతకు ముందే చెప్పినట్టు ఓదార్పు అంటే కేవలం బాధిత కుటుంబాల వారికి ఆర్థిక సాయం చేయడం ఒక్కటే కాదు. ఆర్థికసాయం ఓదార్పులో ఓ అంశం మాత్రమే. కష్టాల్లో ఉన్నవారి ఇంటికి వెళ్లి వారిని పలకరించడం, కన్నీళ్లు తుడవడం, వారి కష్టసుఖాలను తెలుసుకోవడం, వారికి భరోసా ఇవ్వడం ముఖ్యం. అదే మన సంప్రదాయం కూడా.ఈ సంప్రదాయాన్ని అనుసరించే నేను ఓదార్పు యాత్రను ప్రారంభించాను. మధ్యలో కొందరు ఈ పవిత్ర కార్యక్రమాన్ని అవహేళన చేయడమే కాదు, ఈ మరణా లన్నీ అవాస్తవమని వ్యాఖ్యానాలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీ అధినాయకత్వం బాధిత కుటుంబాలకు సాయం అందించాలని నిర్ణయం తీసుకోవడం ద్వారా ఓదార్పు ఆవశ్యకతను, అందులోని నిజాయితీని గుర్తించి నట్టయింది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు కూడా పాలు పంచుకుంటే.. బాధితుల దగ్గరికి నాతో పాటు వచ్చి బాధిత కుటుంబాలతో పరిచయం ఏర్పరచుకుంటే, వారి సమస్యలు తెలుసుకుంటే ఆ కుటుంబాలకు ఇంకా మంచి చేయగలుగుతాం. అందువల్ల ఈ మొత్తం కార్య క్రమానికి పరిపూర్ణత చేకూరుతుంది. దివంగత నేతకు నిజమైన నివాళి అర్పించినట్టవుతుందన్నారు.




