ఔరంగ జేబు కంటే ద్రోహి – రోశయ్య

‘బాబ్లీ యాత్రకు వెళ్లినప్పుడు తమకు జరిగిన అవమానాలపై మాట్లాడుతూ చంద్రబాబు నా గురించి అనుచిత వ్యాఖ్య లు చేశారు. నన్ను ఉద్దేశించి బూటు కాలి తో ఆయనను తంతే తెలిసేదంటూ ఇష్టానుసారంగా మాట్లాడినట్టు చానళ్లలో వ చ్చింది.
అఖిలపక్ష బృందం ఢిల్లీకి వెళ్లి వచ్చాక మరోసారి నాపై విరుచుకుపడుతూ.. నావి నీచ రాజకీయాలని వ్యా ఖ్యానించారు. ఇవన్నీ మతిస్థిమితం తప్పిన వారి లక్షణాలుగానే భావించాల్సి వస్తోం ది. బాబు ఔరంగజేబును మించిన ద్రోహి. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి, సీఎం అయ్యారు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో స్వచ్ఛత గురించి మాట్లాడతారా?’ – రోశయ్య, ముఖ్యమంత్రి
హైదరాబాద్, జూలై 28 : ‘ఔరంగజేబును మించిన ద్రోహి చంద్రబాబు. అలాంటి వ్యక్తికి రాజకీయాల్లో స్వచ్ఛత గురించి మాట్లాడే అర్హత ఎ క్కడిది?’ అని సీఎం రోశయ్య ప్రశ్నించారు. ఇటీవల చంద్రబాబు ఒక ప్రతిపక్ష నేత మాట్లాడకూడని దారుణమైన భా షలో మాట్లాడుతున్నారని, ఆయనకు మతిస్థిమితం తప్పినట్టు కనిపిస్తున్నదన్నారు.
హైదరాబాద్‌లో బుధవారం సో లార్‌కాన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రోశయ్య విలేఖరులతో మాట్లాడుతూ బాబు వైఖరిపై వ్యంగ్యాస్త్రలు సంధించారు. ‘బాబ్లీ యాత్రకు వెళ్లినప్పుడు తమకు జరిగిన అవమానాలపై మాట్లాడుతూ చంద్రబాబు నా గురించి అనుచి త వ్యాఖ్యలు చేశారు.
నన్ను ఉద్దేశించి ఇష్టానుసారంగా మా ట్లాడినట్టు చానళ్లలో వచ్చింది. మళ్లీ బాబ్లీపై అఖిలపక్ష బృందం న్యూఢిల్లీ సందర్శించి వచ్చాక మరోసారి నాపై వి రుచుకుపడుతూ.. నావి నీచ రాజకీయాలని వ్యాఖ్యానించా రు. ఇవన్నీ మతిస్థిమితం తప్పిన లక్షణాలుగానే భావించా ల్సి వస్తోంది’ అని రోశయ్య వ్యాఖ్యానించారు.
‘80 ఏళ్లు నిండిన నాకు నీచ రాజకీయాలకు పాల్పడవలసిన అవసరం లేదు. నేను ఎందరో సీఎంలతో పని చేశాను. నేనలాం టి వాడినైతే అంత మందితో పని చేయడం ఎలా సాధ్యమో చంద్రబాబు విచక్షణకే వదిలేస్తున్నాను” అన్నారు. అయినా ఎవరెలాంటి వారో తెలుగు ప్రజలకు తెలుసునని, తానేమీ ఎవరికీ వెన్నుపోటు పొడిచి ఈ కుర్చీపై కూర్చొనలేదని స్ప ష్టం చేశారు.
బాబ్లీ వ్యవహారంలో టీడీపీ బృందం మహారా ష్ట్ర వెళ్లినప్పుడు ఎన్నిసార్లో మహారాష్ట్ర సీఎం చవాన్‌తో మా ట్లాడానని, చివరికి వారిని బస్సుల్లో హైదరాబాద్ పంపుతామంటే అన్ని రోజులు నానా ఇబ్బందులు పడ్డారు, బస్సు ల్లో వద్దని ప్రత్యేక విమానం కూడా ఏర్పాటు చేయించానని రోశయ్య వివరించారు.
‘ఆ ఖర్చు ప్రభుత్వం భరించడం ఇష్టం లేకపోతే వాపసు చేయమనండి. దాన్ని ప్రభుత్వ ఖ జానాలో జమ చేయిస్తాను’ అని రోశయ్య అన్నారు. బాబ్లీపై ఢిల్లీ వెళ్లిన అఖిలపక్షంలో కూడా బాబు ఏకాకిగానే మిగిలిపోయారని ఆయన గుర్తు చేశారు. ప్రధానిని కలిశాక జరిగిన మీడియాసమావేశంలో పాల్గొనేందుకు బాబును తాను ఆహ్వానించానని, కానీ ప్రతిపక్షం వేరుగా మీడియాతో మా ట్లాడుతుందని చెప్పి రాలేదని రోశయ్య చెప్పారు.
బాబుకున్నంత ఆకర్షణ శక్తి తనకు లేకపోయినా అందరూ తన వెంట వచ్చారంటే అది తన చిత్తశుద్ధికి, నిజాయితీకి గుర్తిం పు అని రోశయ్య వ్యాఖ్యానించారు. ‘1983లో ఎన్టీఆర్ టీడీపీ పెట్టిన సమయంలో బాబు కాంగ్రెస్‌లో ఉన్నారు. ఎన్టీఆర్‌పై పోటీ చేస్తానని బీరాలు పలికారు.
చంద్రబాబు మాటలు నమ్మి అతనికి మద్దతు ఇవ్వవద్దని అప్పట్లో ఇందిరాగాంధీ స్వయంగా మాతో చెప్పారు. ఆ తర్వాత అదే పార్టీలో చేరి, సమయం కోసం చూసి, ఆయనకే గొయ్యి తవ్విన విషయం అందరికీ తెలుసు’ అని ఆయన చెప్పారు.
మన దేశంలో పిల్లనిచ్చిన మామను తండ్రితో సమానంగా చూస్తారని, ఆంధ్రప్రదేశ్ సంప్రదాయం అంతకన్నా ఉత్కృష్టమైనదని పేర్కొన్నారు. అంతటి గౌరవనీయ వ్యక్తినే రాత్రికి రాత్రే పదవీచ్యుతుని చేసిన చంద్రబాబు అధికారం కోసం కన్న తల్లిదండ్రులనే చెరసాల పాల్జేసిన ఔరంగజేబును మించిన ద్రోహి అని రోశయ్య దుయ్యబట్టారు.




