కడప పేరును పూర్తిగా మార్చడం సరికాదు – డి.ఎల్‌

DL Ravindra1
దేవతల కాలంలోనే కడపకు ప్రత్యేక స్థానం ఉందని కడపను వేంకటేశ్వరుని తొలిగడపగా పురాణాల్లో తెలపడం జరిగిందని ఇలాంటి ప్రత్యేకత ఉన్న జిల్లా పేరును పూర్తిగా తొలగించి వైఎస్‌ఆర్‌ జిల్లాగా మార్చడం సరికాదని మైదుకూరు ఎమ్మెల్యే డీఎల్‌ రవీంధ్రారెడ్డి అన్నారు. స్థానిక తెలుగు గంగ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడు తూ రాష్ట్రానికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా చేసిన సేవ లు మరువరానివన్నారు. వైఎస్‌కు నివాళిగా కడప జిల్లా పేరును వైఎస్‌ఆర్‌ కడప జిల్లాగా మార్చివుంటే బాగుండేదన్నారు. ఇలా జిల్లా పేరును మార్చడం పట్ల చాలా మంది మేధావులు బాధపడుతున్నా రని ఆయన అన్నారు. ప్రభుత్వం జిల్లా పేరును వైఎస్‌ఆర్‌ కడప జిల్లాగా సవ రించపోతే అఖిలపక్షాలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. గతంలో ఒసారి కడపవాసిగా గర్వపడుతున్నానని దివంగత వైఎస్‌ చెప్పడాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Leave a Reply

free website analytics