కె.వి.పి. ఎవరు?’ అని ప్రశ్నిస్తూ హర్ష వాకౌట్
రాష్ట్ర కాంగ్రెస్ ఎం.పీ.లతో బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఎ.పి. భవన్‌లో పి.సి.సి. అధ్యక్షడు డి. శ్రీనివాస్ సమావేశం నిర్వహిస్తున్నారు. వేదికపై రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.వి.పి. రామచంద్రరావు కూడా ఉన్నారు. ఈ సమావేశంలో కూర్చున్న అమలాపురం ఎం.పి. హర్షకుమార్ ఉన్నట్టుండి లేచి వేదికపై కూర్చోవడానికి “కె.వి.పి. ఎవరు?” అని ప్రశ్నించారు. సభలో ఉన్నవారంతా బిత్తరపోయారు. కె.వి.పి. కేవలం ఒక సాధారణ ఎం.పి. అయినప్పుడు పార్టీ కీలకమైన సమావేశంలో కూర్చునే అర్హత కె.వి.పి.కి ఎలా వచ్చిందని ఆగ్రహంగా ప్రశ్నించారు. ఆయనకు ఎవరినుంచి సంతృప్తికరమైన సమాధానం రాలేదు. చివరికి హర్షకుమార్ ఆగ్రహంతో సభ నుంచి వాకౌట్ చేశారు. పార్టీసభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించింది ఈ సమావేశం.




