కేంద్రం స్పందించకుంటే తడాఖా చూపిస్తాం – బాబు

‘ఆయనను బూటు కాలితో తన్నాలని నేను అన్నట్లుగా సీఎం పదేపదే చెప్పుకొంటున్నారు. ఏదైనా విషయం ఉంటే నేను గట్టిగా మాట్లాడతాను కానీ అసభ్యం గా మాట్లాడను. అలాంటి సంస్కృతి నాకు లేదు. ఊహించుకొని మాట్లాడితే నేనేమీ చేయలేను. సీఎంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన పోరాడలేరు. మేం పోరాడితే మమ్మల్ని తిడతారు. ముఖ్యమంత్రికి వయసు వస్తే సరిపోదు… దాంతో పాటు హుందాతనమూ పెరగాలి. తమ ప్రాజెక్టుల కోసం మహారాష్ట్ర సీఎం బలంగా పోరాడుతుంటే… మన సీఎం మాత్రం సమస్యపై పోరాడుతున్న మాపై విరుచుకుపడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రికి వయసు వస్తే సరిపోదని, దాంతోపాటు హుందాతనం కూడా పెరగాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. బుధవారం తన నివాసంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భం గా తనపై రోశయ్య చేసిన విమర్శల విషయం ప్రస్తావనకు వచ్చింది.
‘ఆయనను బూటు కాలితో తన్నాలని నేను అన్నట్లుగా సీఎం పదేపదే చెప్పుకొంటున్నారు. ఏదైనా విషయం ఉంటే నేను గట్టిగా మాట్లాడతాను కానీ అసభ్యంగా మా ట్లాడను. అలాంటి సంస్కృతి నాకు లేదు. ఊహించుకొని మాట్లాడితే నేనేమీ చేయలేను. సీఎంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన పోరాడలేరు. మేం పోరాడితే మమ్మల్ని తిడతారు.
గోదావరి నదిపై అక్రమంగా 13 ప్రాజెక్టులు కట్టి కూడా మహారాష్ట్ర సీఎం వాటి తరఫున బలంగా పోరాడుతున్నారు. అవి అక్రమం అన్నందుకు ఇక్కడ మన సీఎం మాపై విరుచుకుపడుతున్నారు. మాపై విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలకు నాది ఒకే ప్రశ్న. ఆ 13 ప్రాజెక్టులు సక్రమమైనవేనని చెప్పండి చూద్దాం. మన హక్కులు మనం కాపాడుకోలేకపోతే భావి తరాలు మనల్ని క్షమించవు.
కోర్టుల తో… కేసులతో ఈ సమస్యలు పరిష్కారం కావు. రాజకీయ పరిష్కారం కావాలి. సుప్రీంకోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి నా ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు, వాజపేయి జోక్యం చేసుకొని, కావేరీ జలాలను తమిళనాడుకు ఇప్పించారు. నర్మద నీటి పంపకంపై 3 రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడినప్పుడు 1972లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వారిని కూర్చోపెట్టి జలాల పంపిణీని తేల్చడంతోపాటు, ఆ నది నీటిని అదనంగా రాజస్థాన్‌కు కూడా ఇవ్వడానికి ఒప్పించారు. ఆ చొరవ ఇప్పటి ప్రధానిలో లోపించింది’ అని బాబు పేర్కొన్నారు.
ప్రధాని వద్ద జరిగిన అఖిలపక్ష సమావేశం తర్వాత తాను మాట్లాడిన పద్ధతి బాగోలేదని రోశయ్య అంటున్నారని, అఖిలపక్షం డిమాండ్లలో ఏ ఒక్కదానికీ ప్రధాని ఆమోదం తెలపకపోయినా తాము సంతృప్తి వ్యక్తం చేయాలా అని ఆయన ప్రశ్నించారు.
వామపక్ష పార్టీ లు కూడా అఖిలపక్షం ఫలితంపై అసంతృప్తి వ్యక్తం చేశాయని, సంతృప్తి వ్యక్తం చేసిన వారికి ఏం నచ్చిందో వారే చెప్పాలని ఒక ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు వ్యా ఖ్యానించారు. తాము ఇచ్చిన గడువులోగా కేంద్రం తేల్చకపోతే ఏం చేయాలో తమ పార్టీలో చర్చించి, నిర్ణయిస్తామని, ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.
ఆమరణ దీక్ష చేపడతారా అన్న ప్రశ్నకు పార్టీలో చర్చించాక అన్ని విషయాలు చెబుతామని బదులిచ్చారు. గడువులోగా సమస్యను పరిష్కరించకపోతే తెలుగువాడి సత్తా చూపిస్తామని బాబుస్పష్టం చేశారు. కర్ణాటక మాదిరిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముడి ఇనుప ఖనిజం ఎగుమతిని నిషేధించాలని డిమాండ్ చేశారు.
వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్
మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ, మరో 13 ప్రాజెక్టులపై చర్చించాలంటూ లోక్‌సభలో టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ బుధవారం తిరస్కరించారు. దీంతో ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు.




