కేరళ పర్యాటక ప్రచార దూతగా అమితాబ్‌

amitabh-bachchan1
కేరళ పర్యాటక ప్రచార దూతగా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచన్‌ ఎంపికైనారు. కేరళ ప్రభుత్వం రాసిన లేఖకు సమాధానంగా పర్యాటకప్రచార దూతగా వ్యవహరించడానికి అమితాబ్‌ అంగీకరించారు. తన అంగీకారాన్ని తెలిపే లేఖను కేరళ పర్యాటక శాఖ మంత్రి కొడియేరీ బాలకృష్ణన్‌కు పంపారు. అంగీకారం తెలియజేసినందుకు అమితాబ్‌కు మంత్రి బాలకృష్ణన్‌ ధన్యవాదాలు తెలిపారు. కేరళ సర్కారు ప్రతిపాదన తనకు బాగా నచ్చిందని దీనిపై త్వరలోనే చర్చలు జరపగలనని అమితాబ్‌ అన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మలయాళ టివి ఛానలుకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ తన ఆసక్తిని అమితాబ్‌ వెల్లడించారు. తనెంతో అభిమానించే కేరళకు ప్రచార దూతగా ఉండబోయే అవకాశం రావడం ఉత్తేజితం చేస్తోందని అమితాబ్‌ అన్నారు. అమితాబ్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘పా’ చిత్రాన్ని అమితాబ్‌తో కలసి చూసిన సందర్బంగా మోడీ ఒకప్రతిపాదన చేశారు. గుజరాత్‌కు ప్రచార దూతగా వ్యవహరించాలని అమితాబ్‌ను మోదీ కోరారు. దీనికి అమితాబ్‌ అంగీకరించడం కూడా జరిగిపోయాయి. కాగా అమితాబ్‌ను ప్రచార దూతగా వినియోగించుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పర్యాటక కేంద్రాలను ఎంపిక చేసింది. ఇందులో గిర్‌ సింహాల అభయారణ్యం, కచ్‌లోని శ్వేత ఎడారి, ద్వారక, సోమనాథ్‌, అంబాజీ, పాలితానాలు ఉన్నాయి.

Leave a Reply

free website analytics