కేసిఆర్‌తో ముఖాముఖికి సిధ్దం – లగడపాటి సవాల్‌

789ఆంధ్రాలో కన్నా తెలంగాణాలోనే అభివృద్ధి ఎక్కువ జరిగిందని, ఈ విషయమై సాంకేతిక వివరణలతో సహా రుజువు చేస్తానని, ఇందుకు టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌తో ఎక్కడైన ఎప్పుడైనా ముఖాముఖి చర్చకు సిద్ధమని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ కెసిఆర్‌కు సవాల్‌ విసిరారు. తెలంగాణా జిల్లాలలో ఎక్కడైనా తనతో కెసిఆర్‌ ముఖాముఖికి చర్చకు సిద్ధపడాలని అంతేగాక తామిద్దరిని ఒకే గదిలో ఉంచి దీక్షలకు అనుమతిస్తే కేవలం గాలి, నీరుతో ఆయన కన్నా ఎక్కువ రోజుల దీక్షకు సైతం తాను సిద్ధంగా ఉన్నానని రాజగోపాల్‌ ప్రకటించారు. ఇందుకు హైదరాబాద్‌, సిద్ధిపేటలలో ఎక్కడైనా ఆయన తన సవాల్‌కు ప్రతిస్పందించాలన్నారు.

Leave a Reply