కేసీఆర్‌ది కుటుంబ పార్టీ – గోనె

టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ తన కుటుంబ సభ్యుల కోసమే పార్టీని స్థాపించా డని, తెలంగాణ ప్రజల కోసం కాదని మాజీ ఆర్టీసీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు ఎద్దేవా చేశారు. శనివారం కరీంనగర్ లోని డిసిసి కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పా టు చేశారు. రాజకీయంలోకి దింపి ఆయన కుమారుడు కెటిఆర్‌ను ఎమ్మెల్యేను చేసి తిరిగి మళ్లీ సిరిసిల్లలో పోటీలో నిలబెట్టారని, కెసిఆర్ కూతురు కవితను కూడా రాజకీయ రంగంలో దింపుతున్నాడని ఆరోపించారు. ఇప్పటికే జాగృతి మహిళా నాయకురాలి పేరిట పలు కార్యక్రమాలను నిర్వహించి ప్రజల వద్దకు వెళ్లారిన గుర్తు చేశారు. సిద్దిపేటనుంచి అల్లుడు హరీష్‌రావును ఎమ్మెల్యే చేశాడని, పార్టీని కుటుంబ స్వప్రయోజనాలకే వినియోగిస్తున్నాడని ఆరోపించారు.
డిసెంబర్ 31తరువాత కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఆర్టికల్-3,4 ప్రకారం తెలంగాణ విభజన అభిప్రాయ సేకరణ ప్రకారం విభజన జరుగుతుందన్నారు. కాగా టిఆర్‌ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ తెలంగాణ వచ్చుడో ెసిఆర్ చచ్చుడో అని దీక్షలో కూర్చోవడం జరిగిందన్నారు. తద్వారా అమాయకమైన మూడు వందల మంది విద్యార్థులను బలిదానం చేశారని, మళ్లీ ఉద్యమం అని ెసిఆర్ పేర్కొనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకా ఎంత మందిని పొట్టన పెట్టుకుంటావని ప్రశ్నించారు.




