కొనసాగుతోన్న విద్యుత్ కేంద్రాల నిర్మాణం
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఏడాదికేడాది గ ణనీయంగా పెరుగుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి, సరఫరా లేకపో వడంతో యథేచ్ఛగా విద్యుత్ సరఫరాలో కోత విధించాల్సి వస్తోంది. అయినప్ప టికీ నిర్మాణంలో ఉన్న విద్యుత్ కేంద్రాలను సకాలంలో పూర్తి చేయడానికి ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం విద్యుత్‌రంగ స్థితిగతులు ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్లుగా తయారయ్యాయి. రాష్ట్రంలోని బొగ్గు, జల, గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాల పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పా దక సామర్థ్యం 12 వేల 427 మెగావాట్లు. దీనికి అదనంగా వచ్చే అయిదేళ్లలో మరో 10 వేల 992 మెగావాట్లను సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే ఈ దిశగా అడుగులు వేసిన దాఖలాలు లేవు. అందుబాటులో ఉన్న కేంద్రాలు పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పాదనను చేపట్టలేకపోతున్నాయి. కొత్తగా నిర్మాణంలో ఉన్న బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు సకాలంలో అందుబాటులోకి రావడం లేదు. గడువులోగా విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటే కొంతలో కొంతమేరకైనా డిమాండ్‌ను అందుకోవచ్చనే అభిప్రాయం విద్యుత్‌రంగ నిపుణుల్లో వ్యక్తమౌతోంది. ఈ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని వారు అభిప్రాయపడుతు న్నారు.
ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తి మొదలు పెట్టాల్సిన కొన్ని కేంద్రాలు ఇంకో ఆరు నెలలకైనా అందుబాటులోకి వస్తాయన్నది అనుమా నమే. వరంగల్ జిల్లా భూపాలపల్లి వద్ద నిర్మితమవుతోన్న 500 మెగావాట్ల కాకతీయ థర్మల్ కేంద్రం స్టేజీ-1 కిందటి నెలలోనే పనులను పూర్తి చేసుకో వాల్సి ఉంది. అది సాధ్యపడలేదు. ఇప్పటికీ అక్కడ పనులు మందకొడిగానే సాగుతున్నాయి. ఈ కేంద్రంలో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కనీ సం ఆరునెలల సమయం పట్టవచ్చని తెలుస్తోంది. కూలింగ్ టవర్స్, ఇతర పైప్‌లైన్‌ల నిర్మాణం కొనసాగుతున్నట్లు సమాచారం. కడపజిల్లా ముద్దనూరు వద్ద ఉన్న రాయలసీమ థర్మల్ కేంద్రం యూనిట్-5 ఈ ఏడాది ఆగస్టు నాటికి అందుబాటులోకి రావాల్సి ఉంది.
210 మెగావాట్ల సామర్థ్యం గల ఈ యూనిట్‌లో బాయిలర్ అమరిక, కూలింగ్ టవర్స్ నిర్మాణ పనులు కొనసాగు తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్లాంట్‌కు సంబంధించిన కొన్ని ఇంజనీరింగ్ పనులు సైతం నత్తనడకనే సాగుతున్నాయి. కొత్తగూడెం థర్మల్ కేంద్రం స్టేజీ-6లో ఈ ఏడాది చివరినాటికి ఉత్పత్తి మొదలు కావాల్సి ఉంది. దీని ఉత్పాదక సామర్థ్యం 500 మెగావాట్లు. ఈ కేంద్రంలోనూ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. పవర్, సర్వీస్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాట్లు ఇంకా కొనసాగుతూనే ఉంది. కాళేశ్వరం నదికి అనుసంధానం చేస్తూ పైప్‌లైన్ల నిర్మాణం ఇంకా పూర్తి కావాల్సి ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాలా జల విద్యుత్ కేంద్రం యూనిట్-6 నిర్మాణ పనులు ఇంకా జరుగుతున్నాయి.
ఈ ఏడాది జులై 10 నాటికి ఈ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన మొదలు కావాల్సి ఉంది. పనులు మాత్రం ఇప్పట్లో పూర్తయ్యేలా లేవు. ఈ కేంద్రం ఉత్పాదక సామర్థ్యం 39 మెగావాట్లు. 500 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణంలో ఉన్న డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం(వీటీపీఎస్) ఏడో యూనిట్ కిందటి నెల వరకూ సాంకేతిక లోపాలతో కొట్టుమిట్టాడిన విషయం తెలిసిందే. ఉత్పాదనకు ముందే ఈ యూనిట్‌లో మూడుసార్లు ప్రమాదా లు జరిగాయి. ఇదిలావుం డగా, వచ్చే ఏడాది పూర్తి కావాల్సిన మరికొన్ని ప్రాజెక్టులు ఇంకో రెండేళ్లకు గానీ అందు బాటులోకి వచ్చే అవకాశాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని జెన్‌కో ఎలా అధిగమిస్తుందనేది ప్రశ్నార్థకం. అయిదేళ్లలో 10 వేల 992 మెగావా ట్ల మేర అదనపు విద్యుత్ ఉత్పత్తి సాధించాల్సిన అత్యవసరం ఉన్నప్పటికీ ప్రభుత్వం దీనిపై శ్రద్ధాసక్తులు చూపించడం లేదు.




