క్షీణించిన వైయస్ వివేనంద రెడ్డి ఆరోగ్యం
సమైక్య ఆంధ్రప్రదేశ్ కు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్సీ వైఎస్ వివేకానందరెడ్డి ఆరోగ్యం శుక్రవారానికి బాగా క్షీణించింది. వివేకానందరెడ్డి దీక్ష ప్రారంభించి శుక్రవారానికి నాలుగో రోజుకు చేరుకుంది. వివేకానందరెడ్డికి శుక్రవారం ఉదయం పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన ఆరోగ్యం క్షీణించిందని తెలిపారు. దీక్షలో ఉన్న వివేకానందరెడ్డికి చలి కారణంగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకిందని వారు వెల్లడించారు. రక్తంలో గ్లూకోజ్, ప్రోటీన్స్ పరిమాణాలు కూడా తగ్గిపోయాయని వారు పేర్కొన్నారు. ఆరోగ్యం క్షీణించినప్పటికీ సమైక్యాంధ్రకు అనుకూలంగా కేంద్రం ప్రకటించే వరకూ దీక్ష విరమించబోనంటూ వివేకానందరెడ్డి మొండిగా ఉన్నారు. మరో పక్కన వివేకానందరెడ్డి చేస్తున్న దీక్షకు మద్దతుగా ఆయన సతీమణి కూడా గురువారం దీక్షలో కూర్చున్నారు.




