ఖైదీల జీవితంలో మార్పు రావాలి – తనికెళ్ల భరణి

Tanikellabharani
తెలిసో తెలియకో తప్పు చేసి జైల్‌కు వచ్చిన ఖైదీలు శిక్షా కాలం పూర్తయి విడుదలయ్యాక జైలు జీవి తం వారిలో మార్పు తేవాలని, వారు ఆదర్శప్రాయం కావాలని పేర్కొన్నా రు. స్థానిక సెంట్రల్ జైల్‌ను శనివారం సందర్శించిన ఆయన ఖైదీలతో గడి పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి న సమావేశంలో ఆయన మాట్లాడు తూ ఎవరూ కావాలని నేరం చేయర న్నారు.  పొరపాటున జరిగే సంఘటన చాలామంది జీవితాల్లో స్వేచ్ఛను హరిస్తుందన్నారు. కులమతాలకు అతీ తంగా అందరూ సినిమా హాల్‌లో ఆ నందిస్తారని పేర్కొన్నారు. మనిషిలో ఈర్ష్యా, ద్వేషం, స్వార్థం వల్ల కోపం పెరిగి నేరం చేస్తారని చెప్పారు. కోపం రాని మనిషి ఎవరూ ఉండరన్నారు. నే రం జరిగిన తరువాత 99 శాతం మం ది పొరపాటు జరిగిందని ఒప్పుకుం టారని పేర్కొన్నారు.  కారాగారం అం టే శిక్షణాలయమని ఇక్కడ పని చేస్తున్న అధికారులు అందరూ ఉపా ధ్యాయులని అభిప్రాయపడ్డారు. ఈ జైల్‌లో అధికారులు, ఖైదీల మధ్య ఉన్న అనుబంధం అద్భుతమైందన్నా రు. జీవితం విలువ ఖైదీలకు తెలిసి నంతగా బయట వారికి తెలియ దన్నారు.  భార్య హత్య కేసులో శిక్ష పడిన ఖైదీ జైల్‌లోనే ఆత్మహత్య చేసు కోవడంపై మాట్లాడుతూ ముక్కు, మొహం తెలియని వ్యక్తిని పెళ్లి చేసు కున్న భార్య తనకు చేసిన సేవలను గుర్తించి చేసిన తప్పును తలచుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.  ఈ సందర్భంగా ‘మా ఆవిడకు మంత్రాలు వచ్చే..’ అనే కవి తను వినిపించారు. ఈ సందర్భంగా ఖైదీలు అడిగిన ప్రశ్నలకు సమాధా నాలు ఇచ్చారు. జైల్ సూపరింటెం డెంట్ సాయినాథ్‌రెడ్డిపై రాసిన కవిత ను జగ్గంపేటకు చెందిన ఆఫీజ్ విని పించారు. మరో ఖైదీ రవికుమార్ ‘ప్రేమపై కవితను చెప్పమనగా’ కవిత ను వినిపించారు. ప్రేమ ఐస్ లాంటి దని, పెళ్ళి చాక్‌లెట్ లాంటిదని చమ త్కరించారు.  ఈ సందర్భంగా ఖైదీలు మీ మొదటి సినిమా ఏదన్న ప్రశ్నకు కంచుకవచం సినిమా అన్నారు. ఆ సినిమాకి రెమ్యూనరేషన్ రూ.ఐదు వే లకు గాను మూడు వేలు ఇచ్చారని చెప్పారు. సమావేశంలో ప్రముఖ రచ యిత ఆకెళ్ళ రాఘవేంద్రరావు, జైల్ సూపరింటెండెంట్ జేవీ సాయినా «థ్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఎం.వరప్రసాద్ పాల్గొన్నారు.

Leave a Reply