గ్రామాల్లో ఈ సేవలు ప్రారంభించిన కలెక్టర్ శేషాద్రి
జిల్లాలో గ్రామీణ ఇ.సేవ కేంద్రాల ద్యారా ఆన్‌లైన్‌లో రెవిన్యూ సర్వీసులను జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి తన కార్యాలయంలో మంగాళవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు.ఈ సంధర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు గ్రామీణ ఇ.సేవ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో రెవిన్యూ ఆధారిత సేవలయిన కుల,ఆదాయ,నివాస దృవీకరణ పత్రాలను పొందవచ్చునన్నారు.చిత్తూరు జిల్లాలో 24 మండల కేంద్రాలలో గ్రామీణ ఇ.సేవా కేంద్రాలు ‘‘రూరల్ సర్వీసు డెలివరీ పాయింట్’’ పేరున ప్రారంభించడం జరిగిందన్నారు. కుప్పుం.వి.కోట,రామసముద్రం ,ఏర్పేడు,వడమాలపేట,చౌడేపల్లి,పి .టి.యం,బి.కొత్తకోట,పెనుమూరు, గంగాధరనెల్లూరు,యర్రావారిపాళ్యం,ములకలచెరు వు,సత్యవేడు,పలమనేరు ,తిరుపతి రూరల్,రేణిగుంట,బైరెడ్డిపల్లి, నాగలాపురం,తిరుపతి అర్బన్,బంగారు పాళ్యం,పాకాల,పీలేరు, చంద్రగిరి,మదనపల్లె మండలాలలో గ్రామీణ ఇ.సేవా కేంద్రాలు ప్రారంభమయ్యాయని, గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ సేవలను సద్వినియోగపరచుకోవాలని కలెక్టరు తెలిపారు.శాశ్వత కుల ఆదాయం,నివాస దృవీకరణ పత్రాల కొరకు మండల తహశిల్దారు కార్యాలయాలకు వెళ్ళివలసిన అవసరం లేకుండా దరఖాస్తులను సరైన ఆధారాలతో తగిన రుసుముతో ఈ కేంద్రాలలో సమర్పించవచ్చనన్నారు. దరఖాస్తులను ఇ.సేవా కేంద్రం నుండి దృవీకరణ పత్రము రావలసిన సంబందిత మండలాల ఇ.సేవా కేంద్రాలకు ఆన్‌లైన్ ద్వారా చేరవేయడం జరుగుతుందని,తదుపరి మండల రెవిన్యూ అధికారి కార్యాలయం ఆ దరఖాస్తుపై నిర్ణీత కాలపరిమితితో విచారణ చేసి సంబందిత ఇ.సేవా కేంద్రమునకు దృవీకరణ పత్రము జారీచేయడం జరుగుతుందన్నారు.రంగారెడ్డి జిల్లాలో గ్రామీణ ఇ.సేవా కేంద్రాలద్వారా రెవన్యూ సర్వీసులు విజయవంతంగా ప్రజలకు సేవలందించడం జరుగుతోందన్నారు.ఈ కార్యక్రమనికి జిల్లా సంయుక్త కలెక్టరు ఎస్.సురేష్ కుమార్ సంబందిత 24 మండలాల తహశిల్దార్ లు,రాష్ట్ర గ్రామీణ ఇ.సేవా కేంద్రాల కొ ఆర్డినేషన్ కమిటీ మెంబర్ శ్రీవాత్సవ్,ఎ.పి.ఆన్‌లైన్ ప్రతినిధి బి.సోమశేఖర్ రెడ్డి,ఎ.పి ఆన్‌లైన్(టిసిఎస్) తదితరులు హజరయ్యారు.




