గ్రూప్‌1 పరీక్షలు యధాతథం – జిల్లా కలెక్టర్‌ డా. బి.జనార్థన్‌రెడ్డి

cll
ఎపిపిఎస్సీ ద్వారా ఈనెల 5న నిర్వహించే గ్రూప్‌1 ప్రిలిప్స్‌ ప్రాథమిక దశ పరీక్షలు యధాతథంగా జరుగుతాయనీ జిల్లా కలెక్టర్‌ డా. బి.జనార్థన్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని 14 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ పరీక్షకు జిల్లా నుంచి 7515 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు పరీక్ష ఉంటుందన్నారు. ఈమేరకు పరీక్ష నిర్వహణకు సంబంధించి అయా కేంద్రాల కళాశాలల ప్రిన్సిపాళ్లకు, ప్రధానోపాధ్యాయులకు తగు సూచనలు జారీ చేశామన్నారు. అత్యంత పకడ్భందిగా పరీక్షను జరిపేందుకు, పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన పొలీస్‌ సిబ్బందిని వినియోగించుకునేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్షలు ప్రశాంతవాతావరణంలో నిర్వలహరించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలనీ ఆయన కోరారు.
పరీక్ష కేంద్రాల వివరాలు
జెఎన్‌టియు కళాశాల ఆఫ్‌ ఇంజనీరింగ్‌ (అటామనస్‌), ఎస్కేయూ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, ఇంటెల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, ఎస్‌ఎస్‌బిఎన్‌ జూనియర్‌, డిగ్రీ కళాశాలలు, కెఎస్‌ఆర్‌ గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజ్‌, గవర్నమెంట్‌ కాలేజ్‌ ఫర్‌ మెన్‌, సివిఎల్‌ఎన్‌ఆర్‌ డిగ్రి అండ్‌ పిజి కాలేజ్‌, ఎస్వీ డిగ్రీ అండ్‌ పిజి కాలేజ్‌,శ్రీ సత్యసాయి జూనియర్‌ కాలేజ్‌ (ఆలమూరురోడ్డు), కేశవరెడ్డి కాన్సెప్ట్‌ స్కూల్‌ (మారుతినగర్‌), రవీంద్రభారతి స్కూల్‌ (హరిహరటెంపుల్‌), సెయింట్‌ ఆంట్స్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ (పిల్లిగుండ్లకాలనీ) కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించనున్నామనీ జిల్లా కలెక్టర్‌ డా. బి.జనార్థన్‌రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

free website analytics