చిరంజీవి 21న అనకాపల్లికి

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఈ నెల 21న అనకాపల్లి వస్తున్నారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, చెరకు రైతులకు టన్నుకు 2,500 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లిలో నిర్వహించనున్న రాష్ట్ర సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. ఆ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖ చేరుకుంటారని, అక్కడి నుంచి నేరుగా అనకాపల్లి బైపాస్‌రోడ్డులోని పార్టీ కార్యాలయానికి వస్తారని చెప్పారు. పదిన్నర గంటలకు సుంకరమెట్ట జంక్షన్ నుంచి ప్రదర్శనగా బయలుదేరి నెహ్రూచౌక్‌కు చేరుకుంటారని, ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారని గంటా శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం ఆయన ఈ సదస్సు నిర్వహణ, ఏర్పాట్లపై పార్టీ ముఖ్యనేతలతో సమీక్షించారు. ఈ మేరకు ఒక కమిటీని వేయాలని నిశ్చయించారు. సమావేశంలో దంతులూరి దిలీప్‌కుమార్, దంతులూరి రాజాబాబు, కాయల మురళి, నిమ్మదల సన్యాసినాయుడు, ఉగ్గిన రమణమూర్తి, తాడి రామకృష్ణ, బొడ్డేడ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.




