డీఎస్ ఓటమి ఖాయం – కిషన్‌రెడ్డి

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డి.శ్రీనివాస్ వంద కోట్లు ఖర్చు పెట్టి ఉప ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి భరోసా వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలో పర్యటించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ డి.శ్రీనివాస్ ఉప ఎన్నికల్లో గెలువడానికి వంద కోట్ల రూపాయలను తెచ్చి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని అన్నారు. నోట్లతో వచ్చే అధికార పార్టీ నాయకులకు ఓట్లతో సమాదానం చెప్పాలని అర్బన్ ప్రజలకు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ వాదాన్ని గెలిపించడానికి మహిళలు, యువకులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు ముందుకు వస్తున్నారని అన్నారు. యెండల లక్ష్మినారాయణకు మద్దతుగా తాము నగరంలోని ఆయా డివిజన్‌లలో ప్రచార పాదయాత్రలు చేసినప్పుడు ప్రజల నుండి మంచి స్పందన లభించిందని ఇటు వంటి స్పందన తన 30 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఎప్పుడు చూడలేదని ఈ ఉప ఎన్నికల్లో తెలంగాణ వాదాన్ని గెలిపించుకోవడానికి న్యాయవాదులు, మహిళలు, విద్యార్థులు,యువకులు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం పట్ల అర్బన్ నియోజకవర్గం పేరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు.




