డీజీపీకి హైకోర్టు నోటీసు

1-1రాష్ట్ర డీజీపీ గిరీష్ కుమార్, మాజీ డీజీపీ మహంతిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ తీర్పును సవాలు చేస్తూ మాజీ డీజీపీ ఎస్ ఎస్ పీ యాదవ్ హైకోర్టులో వేసిన పిటీషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటీషన్ విచారణ చేసిన హైకోర్టు ప్రస్తుత డీజీపీ, మాజీ డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. డీజీపీగా గిరీష్ కుమార్ ను నియమించడం చెల్లదని క్యాట్ తీర్పును ఇస్తూనే, కేంద్ర ప్రభుత్వం మరో డీజీపీ పోస్టుకు అనుమతి ఇచ్చిన నాటి నుండి గిరీష్ కుమార్ అత్యున్నత శ్రేణి వేతనానికి అర్హుడు కాదని యాదవ్ తన పిటీషన్ లో పేర్కొన్నారు. అలాగే మహంతి అత్యున్నత శ్రేణి వేతనానికి అర్హుడేనంటూ క్యాట్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని పిటీషన్ లో కోరారు. తనను మళ్లీ డీజీపీగా నియమించాలని యాదవ్ తన పిటీషన్ లో ప్రభుత్వాన్ని కోరారు. ఈ పిటీషన్ ను బుధవారం విచారించిన హైకోర్టు గిరీష్ కుమార్, మహంతిలకు నోటీసులు జారీ చేసింది.

Leave a Reply

free website analytics