తిరుమలలో కోయిల్ ఆళ్వార్
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారంనాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ నిర్వహిస్తున్నారు. సంవత్సరంలో స్వామి ఆలయాన్ని నాలుగు సందర్భాల్లో ప్రత్యేకంగా నిర్వహించే శుద్ధి కార్యక్రమాల్లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఒకటి. ఉగాది పర్వదినానికి ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తుండడం ఆనవాయితీ. ప్రతి ఏటా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుఠ ఏకాదశి సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవలు నిర్వహిస్తారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా స్వామివారికి ఉదయం జరిగే అన్ని ఆర్జిత సేవలను టిటిడి రద్దుచేసింది. తిరుమంజన సేవలు పూర్తయిన తరువాత మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనానికి అనుమతి ఇస్తారు.




