దేశీయ మార్కెట్లో ఫోర్డ్ చిన్న కారు ఫిగో
అమెరికన్ ఆటోమోబైల్ దిగ్గజం ఫోర్డ్ సంస్థ దేశీయ మార్కెట్లోకి కొత్తగా ’ఫిగో’ను విడుదల చేసింది. ఫోర్డ్ సంస్థ ఉత్పత్తుల్లో చిన్న కార్ మోడల్ అయిన ఫిగో మార్కెట్ ధర 3.5లక్షల నుండి 4.48లక్షలుగా ఉండనుంది. ఫిగో కార్‌ను ఇక్కడి నుంచే విదేశాలకూ ఎగుమతి చేయనున్నమని ఫోర్డ్ సంస్థ తెలిపింది. ముందుగా దక్షిణాఫ్రికా దేశంతో మొదలు పెట్టి, ఆ తరువాత ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామని పేర్కొంది. కొత్తగా విడుదలైన ఫిగో మోడల్ కారు1.2లీటర్, 1.4లీటర్ పెట్రోల్, డీజిల్ వర్షన్లలో అందుబాటులో ఉంది. ఎంట్రీలెవెల్ పెట్రోల్ వర్షన్ ఫిగో ధర 3.5లక్షలు కాగా, డీజిల్ కార్ ధర 4.48లక్షల రూపాయలుగా ఉంది. గత కొన్నాళ్ళుగా ఫోర్డ్ ప్రీమియం ఉత్పత్తు లనే అందిస్తూ వచ్చిందని, దీనితో తమ మార్కెట్ వాటా దేశీయంగా 20శా తానికే పరిమితమైందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, (మార్కెటింగ్, సేల్స్ విభా గం) నిగెల్ వార్క్ తెలిపారు. అందుబాటు ధరతో విడుదలైన ఫిగో కారు అన్ని తరగతుల వినియోగదారులను ఆకట్టుకోగలదని అన్నారు. ఫిగో కారు ఎగుమ తులకు భారత్ కేంద్రం కానుందని, పెట్రోల్ వర్షన్ ఫిగో కారు 15.6 కిలోమీ టర్లు, డీజిల్ వర్షన్ 20 కిలోమీటర్లు మైలేజ్‌ను ఇస్తుందని పేర్కొన్నారు. ఫిగో కారు ఎగుమతి ముందుగా దక్షిణాఫ్రికాతో మొదలవుతుందని ఫోర్ట్ ఎండీ మైఖే ల్ బోనెహమ్ అన్నారు. సుమారు 2లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యం గల త మ చెనై్న ప్లాంట్ ద్వారా ఫిగో ఉత్పత్తి అవుతుందని ఆయన తెలిపారు. 2007 సంవత్సరంలో చిన్న కారు ఫిగో తయారీ పనులు ప్రారంభించిన ఫోర్డ్ సంస్థ గత ఏడాది సెప్టెంబరులో పూర్తి చేసింది. ఈ ఏడాది కాంపాక్ట్ కార్ల విభాగంలో గట్టి పోటీ ఇవ్వనున్నామని సంస్థ సీఈఓ ఆలన్ ముల్లీ తెలిపారు. వచ్చే పదేళ్ళలో చిన్న కార్లకు భారత్‌లో రెండింతల వ్యాపారం జరగనుందని ఆయన అన్నారు. ఇప్పటివరకూ ఈ విభాగంలో 1.22 మిలియన్ యూనిట్ల విక్రయా లు జరగడంతో దేశీయంగా చిన్న కార్ల మార్కెట్ 72శాతంగా ఉంది.




