నాన్నను మీ గుండెల్లో పెట్టుకున్నారు – ఓదార్పు యాత్రలో జగన్

‘ఎప్పుడయినా, వానైనా, రాత్రయినా, పగలైనా యాత్రలో పా ల్గొంటూ… మా గుండెల్లో ఉన్నది వైఎస్సార్ అని చాటుతున్న మీ అందరికీ ధన్యవాదాలు’ అంటూ కడప ఎంపీ వైఎస్ జగన్ ఉద్వేగభరితంగా ప్రసంగిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం, కరప, కాకినాడ రూరల్ మండలాల్లో బుధవారం ఆయన ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు. కొత్తూరు, ఎస్.అచ్యుతాపురంలో రెండు కుటుంబాలను జగన్ ఓదార్చారు.
రామచంద్రపురం, వేళంగి, కరప, నడకుదురు తదితరచోట్ల వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించి, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఎంతోమందికి ఎన్నో మేళ్లు చేసిన మహానేతకు ప్రజలు తమ గుండెల్లో గూడు కట్టారని జగన్ చెప్పారు. అందుకే వారి గుండెలు వైఎస్సార్, వైఎస్సార్ అని కొట్టుకుంటున్నాయని పేర్కొన్నారు. అలాంటి నేత తన తండ్రి కావడం గర్వంగా ఉందన్నారు. ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చి వెళ్లారని చెప్పారు.




