నాలుగేళ్లలో మెట్రోరైలు

మెట్రో రైలు హైదరాబాద్ నగరానికి మణిహారంగా మారనుందని ముఖ్యమంత్రి రోశయ్య పేర్కొన్నారు. నాలుగేళ్లలో ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ఎల్ అండ్ టీ ప్రతినిధులను కోరారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాల అనుమతులు సకాలంలో ఇస్తామని హామీ ఇచ్చారు. మెట్రో రైలు ప్రాజెక్టు దక్కించుకున్న ఎల్ అండ్ టీ, ప్రభుత్వం మధ్య శనివారం సచివాలయంలో ఒప్పందం కుదిరింది. ఒప్పంద పత్రాలపై ప్రభుత్వం తరఫున రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అప్పారావు, ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ వి.బి.గాడ్గిల్‌లు సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఐదేళ్లు గడువు పెట్టినప్పటికీ… నాలుగేళ్లలోనే పూర్తి చేయాలని ఎల్ అండ్ టీని ముఖ్యమంత్రిని కోరారు.




