నిరుపేదలకు మెరుగైన వైద్యమే ఆరోగ్యశ్రీ లక్ష్యం – సిఎం రోశయ్య

08.0908.09.01.
క్యాన్సర్‌ గుర్తింపు, పరీక్షా, చికిత్సా కేంద్రాలను అన్ని జిల్లాలలో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా క్యాన్సర్‌ కేర్‌ విభాగాలను ఏర్పాటు చేసే విషయం పరిశీలించాలని ఆదేశించింది. క్యాన్సర్‌ బారీన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఆరోగ్యశ్రీ ట్రస్టు బోర్టు సమావేశం ముఖ్యమంత్రి కె. రోశయ్య అధ్యక్షతన మంగళవారం ఆయన నివాసంలో జరిగింది. ఆరోగ్యశ్రీ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జె. సత్యనారాయణ, ట్రస్టు సీఈఓ బాబు, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎల్‌.వి. సుబ్రహ్మణ్యం తదితరలు సమావేశంలో పాల్గొన్నారు. క్యాన్సర్‌, ట్రామాకేర్‌ కేంద్రాల ఏర్పాటుపై ప్రధానంగా చర్చ జరిపింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను విస్తరించడం ద్వారా ఆరోగ్యశ్రీ సేవలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఇప్పటికే గుర్తించబడిన 7 ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమగ్ర క్యాన్సర్‌ కేర్‌ కేంద్రాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలను ముఖ్యమంత్రి కె. రోశయ్య అధికారులను ఆదేశించారు. మరో 16 జిల్లాలలో ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించే ఉప కేంద్రాలను నెలకొల్పడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ వృద్ధాశ్రమాల్లోని నిరుపేదలు, అనాథలకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న ఆరోగ్యశ్రీ రిఫరల్‌ వ్యవస్ధ ద్వారా అనాథలు, వృద్ధులకు ఉచిత వైద్యం అందించాలని ట్రస్టు పాలక మండలి నిర్ణయించింది. సుమారు 15 వేల మందికి ప్రయోజనం కలిగే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పితాని సత్యనారాయణ విలేఖరులకు తెలిపారు. 0ఆరోగ్యశ్రీ కొత్త పథకం అమలు, అదనపు సిబ్బంది సౌకర్యం కోసం జూబిలీ హిల్స్‌లో ఇప్పటికే గుర్తించిన 3000 గజాల స్ధలంలో కొత్త భవణం నిర్మించాలని సమావేశం నిర్ణయించిందని పితాని సత్యనారాయణ తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం 3 ఇ -హెల్త్‌ ఇండియా అవార్డు 2010 కు ఎంపిక కావడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
ఆరోగ్యశ్రీ విస్తరణకు రూ. 65 కోట్లు – సి.ఎం. రోశయ్య
పేదప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించేలా రాష్ట్రప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించనుంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ ద్వారా రాష్టవ్య్రాప్తంగా 7.30లక్షల సర్జరీలను నిర్వహించారు. మరో మూడు జిల్లాల్లో 50లక్షలమందికి లబ్ది చేకూర్చేలా పధ కాన్ని చేపట్టనుంది. అలాగే రాష్ట్రం లోని ఏడు ప్రభుత్వ ఆసుపత్రు ల్లో కేన్సర్‌ కేర్‌ సెంటర్లతోపాటు 16 జిల్లా ఆసుపత్రుల్లో పాలి యేటివ్‌ కేన్సర్‌ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు ఆరు టీచింగ్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ట్రామాకేర్‌ సెంటర్లను నెలకొల్పేందుకు స న్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రం లో ఆరోగ్యశ్రీ రెండో దశ అమలుకు ముఖ్యమంత్రి సహా యనిధి నుంచి రూ.65 కోట్లు విడుదల చేస్తూ మంగ ళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈనిధుల్లో ఏపీహెచ్‌ఎంహెచ్‌ఐడీసీ రూ.15కోట్లు ఇస్తుండగా, సీఎం ఆర్‌ఎఫ్‌ కింద రూ.50కోట్లను ప్రభుత్వం ఇస్తోంది. ముఖ్య మంత్రి రోశయ్య మంగళవారం తన నివాసంలో ఆరోగ్యక్ష పథకం అమలు, నిధులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రెండో విడత ఆరోగ్యశ్రీ పధకాన్ని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు చిత్తూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో అమలు చేస్తున్నామని ఆరోగ్యశ్రీ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. అలాగే అనాధ శరణాల యాల్లోని 15వేల మందికి ఆరోగ్యశ్రీ వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణ యం తీసుకు న్నట్లు మంత్రి చెప్పారు. కాగా ఆరోగ్యశ్రీ భవనానికి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఖాళీగా ఉన్న పర్యాటక శాఖ కు చెందిన 3000 గజాల స్థలాన్ని కేటాయించినట్లు పితాని తెలిపారు. ఈ సమీక్షా సమా వేశంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్‌ జే. సత్యనా రాయణ, ఆరోగ్య ట్రస్టు సిఈఓ బాబు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
నిమ్స్‌ డైరెక్టర్‌ కోసం కమిటీ…
నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ కొత్త డైరెక్టర్‌ ఎంపిక కోసం వైద్య విద్య శాఖ మంత్రి పి. సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం మంగళవారం ఓ కమిటీని నియ మించింది. ఈ కమిటీలో మంత్రి సుదర్శన్‌రెడ్డితో పాటు డాక్టర్‌ శాంతారం, ఎన్‌టిఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌సైన్సెస్‌ వైస్‌ చాన్స్‌లర్‌ ఐ.వి రావులు ఉన్నారు. ప్రస్తుత నిమ్స్‌ డైరెక్టర్‌ ప్రసాదరావు పదవీకాలం సెప్టెంబర్‌ 29 నాటికి పూర్తి కానున్న నేపధ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ కమిటీ కొత్త డైరెక్టర్‌ను ఎంపిక చేస్తుంది. మంగళవారం సీఎం నివాసంలో నిమ్స్‌ డైరెక్టర్‌ ఎంపికపై ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే నల్గొం డ జిల్లా బీబీ నగర్‌ మండలం రంగాపూర్‌ వద్ద 161 ఎకరా ల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తోన్న నిమ్స్‌ యూనివర్సిటీ నిర్మా ణం దాదాపు పూర్తయిందని, నిపుణుల కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి త్వరలో నివేదిక సమర్పిస్తుందని నిమ్స్‌ డైరెక్టర్‌ దాసరి ప్రసాదరావు సీఎం రోశయ్యకు వివరిం చారు. అలాగే నిమ్స్‌ నర్సింగ్‌, పారా మెడికల్‌, ఆసుపత్రి మేనేజ్‌మెంట్‌ కోర్సులు, పిజి డిప్లమో, పీహెచ్‌డీ కోర్సులు, ప్రధాన మంత్రి స్వాస్త్య సురక్షయోజన వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో వైద్య విద్యశాఖ మంత్రి పి. సుదర్శన్‌రెడ్డితోపాటు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జే. సత్యనారాయణ, నిమ్స్‌ డైరెక్టర్‌ దాసరి ప్రసారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి జి. సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

free website analytics